జాతీయంహోమ్

చంద్రబాబు కేంద్రకంగా మలుపు తిరిగిన తమిళనాడు పాలిటిక్స్

#TamilPolitics

తమిళనాట ఏపీ చిచ్చు రేగింది.. అధికార, ప్రతిపక్షాల మధ్య ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్రాండ్‌తో విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజయం సాధిస్తే, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ ఓడిపోయారని, డీఎమ్‌కే అధినేత, మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్‌ నిప్పులు కురిపించారు..

ఇన్వెస్ట్‌మెంట్స్‌ రేసులో ఏపీ పరుగులు పెడుతుంటే, మీరేం చేస్తున్నారని విజయ్‌ని నిలదీశారు ప్రతిపక్ష నేత స్టాలిన్‌.. తమిళనాడుకు రావల్సిన వేల కోట్ల పెట్టుబడులు, కంపెనీలు ఏపికి క్యూ కట్టడంపై స్టాలిన్‌.. విజయ్‌పై రెచ్చిపోయారు.. వైజాగ్‌ సీఐఐ సదస్సులో కియా అనుబంధ పరిశ్రమలు సుమారు 20 వేల కోట్లతో పెట్టుబడులకు ఎమ్‌ఓయూ కుదుర్చుకున్నాయి.. ఇదే ఇప్పుడు తమిళనాడులో రాజకీయ దుమారం రేపుతోంది..

దక్షిణ కొరియాకు చెందిన ఆటోమొబైల్ విడిభాగాల తయారీ సంస్థలు హ్వాషిన్ (Hwashin), సియోన్ (Seoyon), ఐవామెట్ (Iwamet) అనంతపురంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

ఈ మూడు సంస్థల నుంచి ప్రతిపాదిత పెట్టుబడులు రూ.1,614 కోట్లు. వీటి ద్వారా సుమారు 1,418 ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఈ మూడు సంస్థలు హ్యుందాయ్, కియా వంటి అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థలకు విడిభాగాలు సరఫరా చేస్తాయి. ఈ పెట్టుబడుల కోసం ఏపీ మంత్రి నారా లోకేశ్ జులైలో దక్షిణ కొరియాలో పర్యటించి ఆయా కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు ద్వారా సంప్రదింపులు కొనసాగాయి. చివరకు పెట్టుబడుల ఒప్పందాల వరకు ఈ ప్రయత్నాలు చేరాయి.

మరో వైపు, కియా ఏపీలో తన ప్లాంట్‌ విస్తరణకు రెడీ అవుతోంది.. కియా, దాని అనుబంధ సరఫరాదారుల ద్వారా మరో 18 వేల కోట్ల పెట్టుబడులకి లైన్‌ క్లియర్‌ చేసింది.. ఈ పెట్టుబడితో ఏర్పాటయ్యే కొత్త ప్లాంట్ ద్వారా అదనంగా 2 లక్షల వాహనాల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం అందుబాటులోకి రానుంది. సుమారు 12 వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.

తమిళనాడు రాజకీయాల్లో ఈ పెట్టుబడుల వ్యవహారం చర్చకు దారితీసింది. డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్.. సీఎం విజయ్ ప్రభుత్వంపై పారిశ్రామిక పెట్టుబడుల అంశాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. తమిళనాడుకు రావాల్సిన పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు వెళ్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందన్నది ఆయన విమర్శిస్తున్నారు.. పెట్టుబడులను ఆకర్షించడంలో విజయ్‌ సర్కార్‌ విఫలం అయిందని, చంద్రబాబు ప్రభుత్వం దూసుకుపోతోందని స్టాలిన్‌ ఆరోపిస్తున్నారు.. నిన్నటి వరకు కర్నాటకలో అధికార, ప్రతిపక్షాల మధ్య ఇదే అంశంపై రగడ జరిగింది.. తాజాగా, తమిళనాడులో ఏపీ ప్రకంపనలు రేపుతోంది.. మరి, ఈ పరిణామాలు ఎలాంటి టర్న్‌ తీసుకుంటాయో చూడాలి..

Related posts

అటవీ రెవెన్యూ భూ సరిహద్దు వివాదాలకు శాశ్వత పరిష్కారం

Satyam News

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రతి రోజూ కీలకమే

Satyam News

విద్యుత్ వ్యవస్థ నిర్వహణలో ప్రభుత్వం విఫలం

Satyam News

రెండు పెళ్లిళ్లు..సహజీవనం..అక్రమ సంబంధం..చివరకు మర్డర్

Satyam News

బిష్ణోయ్ గ్యాంగ్ తో భారత్ కలిసి పని చేస్తున్నదా?

Satyam News

ఇళ్ల స్థలాల లబ్ధిదారులను తక్షణమే ప్రకటించాలి

Satyam News

Leave a Comment