విశాఖపట్నంహోమ్

ఉపమాక శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న హోంమంత్రి

#VangalapudiAnitha

నక్కపల్లి మండలం ఉపమాకలో కొలువుదీరిన శ్రీ వేంకటేశ్వర స్వామివారిని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. నక్కపల్లి మండలానికి చెందిన ఎంపీటీసీ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకున్న హోంమంత్రి అనితకు ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత అంతరాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

స్వామివారి దర్శనం అనంతరం వేద పండితుల నుంచి వేద ఆశీర్వచనం స్వీకరించారు. ఆలయ అధికారులు హోంమంత్రి అనితతో పాటు వెంట వచ్చిన ప్రజాప్రతినిధులకు తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా స్వామివారి దివ్య ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని హోంమంత్రి అనిత మనస్ఫూర్తిగా ప్రార్థించారు.

Related posts

రోడ్డును ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం

Satyam News

బీ ఆర్ ఎస్ ను చెప్పి మరీ చితక్కొట్టిన రేవంత్

Satyam News

తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం

Satyam News

మకరజ్యోతి దర్శనంతో తరించిన భక్తులు

Satyam News

కాబూల్ కాందహార్ పై పాకిస్తాన్ పాశవికదాడి

Satyam News

16వ సబ్ జూనియర్ హాకీ ఛాంపియన్ షిప్ ప్రారంభం

Satyam News

Leave a Comment