ప్రత్యేకంహోమ్

భారతి విజయమా? జగన్‌ ఓటమా? ఎవరు గెలిచారు?

#JaganReddyFamily

అత్తగారు, ఆడపడుచులపై.. ఇంటి కోడలు విజయం.. తల్లి, చెల్లి.. భార్య మధ్య యుద్ధంలో కొడుకు సపోర్ట్‌ ఎవరికి.. ఇదేదో డైలీ సీరియల్‌ స్టోరీ కాదు.. ఇద్దరు ముఖ్యమంత్రుల   కుటుంబంలో జరుగుతున్న ఇంటింటి రామాయణం. ఈ ప్యాలెస్ పారాయణంలో.. ఆడపడుచు షర్మిలను కుటుంబ ఆస్తుల నుంచి విజయవంతంగా దూరం పెట్టడం ద్వారా.. యెడుగూరి సందింటి కోడలు భారతీరెడ్డి గెలిచారని చెప్పొచ్చు. ఆస్తుల విషయంలో పైచేయి సాధించినా.. కుమార్తె పెళ్లికి ముందు సొంత చెల్లెలు షర్మిలను కట్టుబట్టలతో ఇంటికి దూరం చేశారనే పేరు తెచ్చుకొన్న జగన్‌మోహన్‌రెడ్డి.. రాజకీయంగా తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకొన్నారు.

యలహంక ప్యాలెస్‌లోని తన నివాసంలోకి షర్మిలను అడుగుపెట్టకుండా అడ్డుకోవడంలో జగన్‌ టీమ్‌ సక్సెస్ అయింది. కోర్టు ఆదేశాలు, పోలీసుల బందోబస్తుతో ప్యాలెస్‌ గేటు కూడా తాకనివ్వకుండా చేశారు. పోలీసుల ఆంక్షలతో షర్మిల, విజయమ్మ యలహంక ప్యాలెస్ గేటు బయట నుంచే వెనుతిరిగిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అత్తగారు, ఆడపడుచులపై ఇంటి కోడలు సాధించిన ఈ విజయానికి రాజకీయంగా మూల్యం చెల్లించేది మాత్రం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆయన పార్టీ వైసీపీ అనే అభిప్రాయం వినిపిస్తోంది.

పక్కా ప్లాన్‌ ప్రకారమే యలహంక ప్యాలెస్‌ నుంచి షర్మిలను గెంటేశారని ఈ మధ్య జరిగిన పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. భారతీరెడ్డి తల్లిగారి పేరు మీద ఉన్న ప్యాలెస్‌ భూములను.. ఆమె తన కుమార్తె, మనవరాళ్లకు బహుమతిగా రాసిచ్చిన రోజే.. షర్మిలను సాగనంపడానికి పథకం సిద్ధం అయిందని తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబుకు.. కుమార్తె పెళ్లి శుభలేఖ ఇచ్చి వివాహానికి ఆహ్వానించడంపై సాక్షి పత్రికలో రోత రాతలతో షర్మిలను రెచ్చగొట్టారు. ఈ కథనంపై సాక్షి మీడియాతో పాటు జగన్‌పై తీవ్ర విమర్శలు చేయడంతో.. ఇదే అదనుగా షర్మిలను యలహంక ప్యాలెస్‌లో అడుగుపెట్టకుండా కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్నారు.

తండ్రి ఆస్తుల్లో వాటాలు రావని అర్ధమైన తర్వాతే.. వైఎస్ షర్మిల.. తన అన్న జగన్‌మోహన్‌రెడ్డిపై రాజకీయ యుద్ధం ప్రకటించారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆస్తుల విషయంలో జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన భార్య భారతీరెడ్డి పైచేయి సాధించినా.. సామాన్య ప్రజలంతా షర్మిలపై సానుభూతి చూపిస్తున్నారు. సానభూతి అస్త్రంతో అధికారంలోకి వచ్చిన జగన్‌.. చెల్లెలితో గొడవను తెగేదాకా లాగడం.. పబ్లిక్‌ సెంటిమెంట్‌ని దెబ్బతీసింది. తోడబుట్టిన సోదరిపైనే జాలి, దయ లేకుండా జగన్‌ వ్యహరించిన తీరు చూసిన తర్వాత.. ప్రజలు ఆయనపై సానుభూతి చూపించే అవకాశం ఏమాత్రం లేదు.

Related posts

డ్రగ్స్ టెస్టుకు మేం సిద్ధం…మీరు సిద్ధమా?

Satyam News

యుఏఈ తో భారత్ కీలక ఇంధన ఒప్పందం

Satyam News

గ్లోబల్ సి బి ఎస్ ఈ  స్కూల్ కు నేషనల్ ఇన్నోవేటివ్ అవార్డు

Satyam News

గోదావరి వరదతో మునిగిపోతున్న కోనసీమ లంక గ్రామాలు

Satyam News

అమెరికా భారత్ మధ్య మళ్లీ వాణిజ్య చర్చలు

Satyam News

ప్రశ్న రావణ్ ముఠా వెనుక ఐఏఎస్ అధికారులు?

Satyam News

Leave a Comment