ప్రత్యేకంహోమ్

బీహార్‌ సీన్‌ ఆంధ్రప్రదేశ్‌లో….!!

#BiharElections

బీహార్‌ పొలిటికల్‌ సీన్‌ ఏపీలో రిపీట్‌ కానుందా…???  ఏపీ ఆర్‌జేడీగా  బీహార్‌ మారనుందా..?? ఆ రెండు పార్టీలకి దగ్గరి పోలికలు ఉన్నాయా…??  ఆ పార్టీకి ఇక అధికారం దక్కడం కష్టం అని భావించవచ్చా…?? అంటే, అవుననే చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు.. వరసగా అయిదవ సారి ఆర్‌జేడీ అధికారానికి దూరం అయింది.. 2004 తర్వాత ఆ పార్టీ తర్వాత నుండి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పార్టీ పవర్‌కి దూరంగా ఉంది..

ప్రతిపక్షానికే పరిమితం అయింది. ఆయన అధికారంలో ఉన్న సమయంలో బీహార్‌ని రౌడీ రాజ్యంగా మార్చారు.. జంగిల్‌ రాజ్‌ని తలపించేలా  హత్యలు, ఘర్షణలతో అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిపారు… ప్రజలను చీకటిలో ఉంచి, అవినీతి, అక్రమాలకి పాల్పడ్డారు. పశువుల దాణా స్కామ్‌లో అడ్డంగా ఇరుక్కున్నారు. జైలుకి వెళ్లి వచ్చారు… నేటికీ కోర్టులు, జైలు చుట్టూ తిరుగుతున్నారు లాలూ యాదవ్‌.. ఇదే ఆయన తనయుడు తేజస్వి యాదవ్‌ కి సైతం నెగిటివ్‌గా మారుతోంది.. వారసుడు ఎంత కష్టపడినా లాలూ మార్క్‌ రౌడీయిజం, పరిపాలన శాపంగా మారుతోంది..

ఏపీలో గతంలో ఒక్కచాన్స్‌ నినాదంతో పవర్‌లోకి వచ్చిన వైసీపీ సైతం ఏపీని సౌత్‌ బీహార్‌లా మార్చేసిందనే కామెంట్స్‌ వినిపించాయి.. మంత్రుల బూతులు, ప్రజాదర్బార్‌ కూల్చివేత, రోడ్లు లేకుండా రాష్ట్రాన్ని గుంతలమయంగా మార్చారు.. ఇక, కంపెనీలను తరిమికొట్టారు.. ముఖ్యమంత్రి జగన్‌ నాడు ప్యాలెస్‌ కదిలి బయటకు రాలేదు.. ప్రజల కష్టాలను పట్టించుకోలేదు.. ఇక, లిక్కర్‌ స్కామ్‌, ఇసుక మాఫియా, రేషన్‌ మాఫియాలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు.. ఏపీలో గతంలో ఎన్నడూలేని విధంగా బీహార్‌ తరహా జంగిల్‌ రాజ్‌ని తలపించారు జగన్‌ తన మార్క్‌ పాలనతో.. ఇటు,  కోర్టు కేసులు, జైలు శిక్షలతో లాలూ అడ్వాన్స్‌డ్‌ వెర్షన్‌లా, లాలూ 2.o పాలనని గుర్తు చేశారు  వైసీపీ అధినేత..

ఇలా సేమ్‌ టు సేమ్‌… లాలూ ప్రసాద్ జంగిల్‌ రాజ్‌, ఆటవిక పాలనని జగన్‌ గుర్తు చేశారు..  గత రెండు దశాబ్దాలుగా ఆర్‌జేడీని ఛీత్కరించుకుంటున్నారు బీహార్‌ ప్రజలు.. ఇదే సీన్‌ ఏపీలోనూ రిపీట్‌ అవుతుందని, జగన్‌, ఆయన మార్క్‌ పాలనని అసహ్యించుకున్నందునే కనీసం ప్రతిపక్షం లేకుండా చేశారు. ఇకపై జగన్‌కి ఓటేయాలంటే 2019 – 24 మధ్య గవర్నన్స్‌ని గుర్తు చేసుకుంటే చాలు… జన్మలో ప్రజలు ఓటు వేయరని చెబుతున్నారు ఎనలిస్టులు… ఇటు, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి… వైసీపీ అధినేతని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.. బీహార్‌లోనూ బీజేపీ, జేడీయూ, ఎల్‌జేపీ ఎలయన్స్‌… చుక్కలు చూపిస్తోంది ఆర్‌జేడీకి.. అంటే, మరో పాతికేళ్ల వరకు జగన్‌కి ఏపీలో చోటు లేదని భావించాలి.. జగన్‌ జంగిల్‌ రాజ్‌కి ఎండ్‌ కార్డ్‌ పడినట్లే భావించాలా..?? లేదా ..?? అనేది

Related posts

విజయ్ తో కలిసి జగన్ ‘మత’ ఫ్రంట్… తోడు కేటీఆర్

Satyam News

ఏపీఎస్‌ఆర్టీసీని ప్రైవేటీకరిస్తే తిరుగుబాటు తప్పదు!

Satyam News

సాగునీటి సంఘాల అధ్యక్షులతో త్వరలో సమావేశం

Satyam News

ఢిల్లీలో అగ్ని ప్రమాదం: 9 మంది మృతి

Satyam News

ఐ ప్యాక్ డైరెక్టర్ ను అరెస్టు చేసిన ఈడీ

Satyam News

రబీ రైతు భరోసా కోసం రాహుల్ గాంధీ కి వినతి

Satyam News

Leave a Comment