సినిమాహోమ్

మళ్ళీ “పెళ్లి చేసుకుందాం” అంటున్న విక్టరీ వెంకటేష్!

#ViktaryVenkatesh

విక్టరీ వెంకటేష్ నటించగా అసాధారణ విజయం సాధించిన చిత్రాల్లో “పెళ్ళి చేసుకుందాం” ఒకటి. అందం – అభినయాల కలబోత సౌందర్య హీరోయిన్ గా సుప్రసిద్ధ దర్శకులు ముత్యాల సుబ్బయ్య తెరకెక్కించిన ఈ ట్రెండ్ సెట్టింగ్ చిత్రాన్ని సి.వెంకట్రాజు – శివరాజు సంయుక్తంగా నిర్మించారు.

పోసాని కృష్ణమురళి సంభాషణలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. ఈ చిత్రాన్ని సాయిలక్ష్మీ ఫిలిమ్స్ పతాకంపై  వరప్రసాద్ రెండు తెలుగు రాష్ట్రాల్లో 4 కె లో భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “సంక్రాంతికి వస్తున్నాం” చిత్రంతో తెలుగులో 300 కోట్ల క్లబ్బు ఫౌండర్ హీరోగా చరిత్ర సృష్టించిన వెంకటేష్ బాబు నటించిన ఆణిముత్యాల్లో ఒకటైన “పెళ్ళి చేసుకుందాం” చిత్రాన్ని 4 కె రిజల్యూషన్ లో డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు ఫ్రెష్ గా తీసుకువచ్చే అవకాశం లభించడం గర్వంగా ఉంది.

మన రెండు రాష్ట్రాల్లో ఉన్న విక్టరీ ఫ్యాన్స్ తోపాటు… సిసలైన సినీ ప్రేమికులంతా “పెళ్ళి చేసుకుందాం” చిత్రాన్ని ఆదరిస్తారనే నమ్మకం ఉంది. మూడేళ్లపాటు ఈ చిత్రం హక్కుల్ని మేము కలిగి ఉన్నాం” అని అన్నారు.

లైలా బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కె.రవీంద్రబాబు, ఎడిటింగ్: గౌతంరాజు, మ్యూజిక్: కోటి, నిర్మాతలు: సి.వెంకట్రాజు-శివరాజు, దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య, రీ-రిలీజ్ : వరప్రసాద్ – సాయిలక్ష్మీ ఫిల్మ్స్.

Related posts

అక్కను వదిలేసి మరో పెళ్ళి చేసుకున్న బావ హత్య

Satyam News

విశాఖ ఉక్కు సీఎండీగా ఎం ఎన్ వీ ఎస్ ప్రభాకర్

Satyam News

కడుపు నొప్పితో వెళితే కాటికి పంపిన వైద్యులు

Satyam News

శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి నెయ్యి నిల్వలకు కొరత లేదు

Satyam News

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా!

Satyam News

ఆడపిల్లకు జరిగిన అన్యాయంపై అడిగితే అక్రమ కేసులు

Satyam News

Leave a Comment