25.7 C
Hyderabad
September 21, 2026
హైదరాబాద్హోమ్

హిల్ట్ పాలసీ పై ఇచ్చిన జి.ఓ రద్దు చేయాలి

#BJPTelangana

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన హిల్ట్ పాలసీ G.O.. 27 ను రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావ్ అధ్యక్షతన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ లు, రాష్ట్ర బీజేపీ నాయకులు కలిసి మెమొరాండం అందించారు. ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హిల్ట్ పాలసీ పేరిట భారీ కుంభకోణానికి తెరలేపిందని ఏకంగా 6.30 లక్షల కోట్ల భారీ కుంభకోణం చేస్తున్నారని అన్నారు.

దీనిద్వారా ORR లోపలి దాదాపు 9292 ఎకరాల భూమిని SRO వాల్యూ లో 30 శాతానికే కట్టబెట్టి లక్షల కోట్ల కుంభకోణం చేస్తున్నారని అన్నారు. ఈ G.O ను తక్షణమే రద్దు చేయాలని గవర్నర్ కి మెమొరాండం అందించారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా,  హిల్ట్ పాలసీ G.O  కి వ్యతిరేకంగా, GHMC పరిధిని పెంచుతూ తెచ్చిన G.O కి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యలో ఈ నెల 7వ తేదిన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లు మల్క కొమురయ్య, అంజి రెడ్డి, రాష్ట్ర బీజేపీ నాయకులు గౌతంరావు, వీరేందర్ గౌడ్, వేముల అశోక్, N.V సుభాష్, శంకర్ యాదవ్, రాధ ధీరజ్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.

Related posts

శృంగారంపై సమంత వ్యాఖ్యలు వైరల్ !

Satyam News

8 వారాలకు సరిపడా చమురు నిల్వలు ఉన్నాయి…

Satyam News

భోగాపురంలో విమానాల తయారీ..?? ఏవియేషన్‌ హబ్‌గా ఉత్తరాంధ్ర

Satyam News

సింగూరు ప్రాంతాన్ని ఆక్రమిస్తున్న మంత్రి బామ్మర్ది

Satyam News

మేడారం జంపన్నవాగులో జలకళ

Satyam News

జగన్ అనుచరుడి ఉద్యోగం ఊడింది

Satyam News

Leave a Comment