25.2 C
Hyderabad
September 20, 2026
జాతీయంహోమ్

త్వరలో జేపీ నడ్డా వారసుడి ఎంపిక

#JPNadda

త్వరలో బీజేపీకి జాతీయ నూతన అధ్యక్షుడు వస్తున్నాడా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే దీనికి అవును అనే సమాధానం వస్తున్నది. జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్న సంకేతాలు గురువారం రాత్రి స్పష్టమయ్యాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి ఎన్నికల షెడ్యూల్‌ను పార్టీ ఖరారు చేసింది.

బీజేపీ సంఘటనా ఎన్నికల ఇన్‌చార్జ్ కె. లక్ష్మణ్ ఇప్పటికే హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ వంటి ప్రధాన రాష్ట్రాల్లోని అధ్యక్షుల ఎన్నికలు పూర్తయిన తరువాతే జాతీయ అధ్యక్షుడి ఎన్నిక చేపడతామని పేర్కొన్నారు. డిసెంబర్ 13న యూపీ బీజేపీ అధ్యక్ష పదవికి నామినేషన్లు స్వీకరిస్తారు.

ఈ ప్రక్రియను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావడే పర్యవేక్షిస్తారు. ఒకే ఒక్క నామినేషన్ వస్తే, అది ఏకగ్రీవం అవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నారు. డిసెంబర్ 14న రాష్ట్ర బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జ్ పీయూష్ గోయల్ కొత్త అధ్యక్షుడి పేరును ప్రకటిస్తారు.

ఇదే తరహాలో, ఢిల్లీ, హర్యానా సహా మిగతా రాష్ట్రాల్లో కూడా త్వరలో అధ్యక్షుల ఎన్నికలు నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. బీజేపీ సంస్థాగత రాజ్యాంగం ప్రకారం, కనీసం సగం రాష్ట్ర సంఘటనా యూనిట్లకు అధ్యక్షుల ఎన్నికలు పూర్తయిన తర్వాతే జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. జాతీయ అధ్యక్షుడి పదవీ కాలం ముగిసినా కూడా ఆయనకు ఇంతకాలం పొడిగింపు లభించింది.

Related posts

అమెజాన్ ప్రైమ్‌లో ‘పోలీస్ కంప్లైంట్’ స్ట్రీమింగ్

Satyam News

తంబళ్లపల్లెలో ‘ ప్రక్షాళన’ పండగ!

Satyam News

పవన్ కల్యాణ్ పై విమర్శలకు చంద్రబాబు సమాధానం

Satyam News

టికెట్ ఏదైనా – యాప్ ఒక్కటే

Satyam News

అయినవిల్లి విఘ్నేశ్వర స్వామిని దర్శించుకున్న సానా సతీష్

Satyam News

ఐబొమ్మ రవికి బెయిల్: నెక్ట్స్ ఏంటీ?

Satyam News

Leave a Comment