26.3 C
Hyderabad
September 19, 2026
విశాఖపట్నంహోమ్

విశాఖకు తరలి వచ్చిన కాగ్నిజెంట్

#Cognizent

విశాఖపట్నంలోని కాపులుప్పాడ ఐటీ హిల్స్‌లో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్‌ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. 8,000 మంది ఉద్యోగులు పనిచేసేలా అత్యాధునిక వసతులతో క్యాంపస్ నిర్మాణం జరుగుతుంది.

మొత్తం రూ.1,583 కోట్ల పెట్టుబడితో 2033 నాటికి 3 దశల్లో కాగ్నిజెంట్ టెక్నాలజీస్ క్యాంపస్ పూర్తి అవుతుంది. 2026 నాటికి మొదటి దశ నిర్మాణం పూర్తి చేసుకుంటారు. అప్పటివరకు అద్దె కార్యాలయంలో కార్యకాలపాలు కొనసాగిస్తారు. ప్రధానంగా ఏఐ, మెషీన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజినీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ వంటి ఆధునిక సాంకేతిక రంగాలపై కాగ్నిజెంట్ దృష్టి సారిస్తుంది.

కాగ్నిజెంట్‌తో పాటు మరో 8 ఐటీ సంస్థలకు కూడా విశాఖలో క్యాంపస్‌లు ఏర్పాటుకు భూమిపూజ జరిగింది. ముఖ్యమంత్రితో పాటు ఐటీ, విద్యా శాఖా మంత్రి నారా లోకేష్, విశాఖ ఎంపీ భరత్ కూడా పాల్గొన్నారు. త్వరలోనే విశాఖ నుంచి కార్యకలాపాలు ప్రారంభించనున్న కంపెనీలలో టెక్ తమ్మిన, సత్వ డెవలపర్స్, ఇమాజిన్నోవేట్ టెక్ సొల్యూషన్స్ ఇండియా, ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్, మదర్సన్ టెక్నాలజీస్, క్వార్క్స్ టెక్నోసాఫ్ట్, ఏసీఎన్ హెల్త్ కేర్ ఆర్సీఎం సర్వీసెస్, నాన్రెల్ టెక్నాలజీస్ సంస్థలు ఉన్నాయి.

ఈ సంస్థల ద్వారా రాష్ట్రానికి రూ. 3,740 కోట్ల పెట్టుబడులు, దాదాపు 41,700 మందికి ఉద్యోగావకాశాలు వస్తున్నాయి. గూగుల్ రాకతో ఇప్పటికే డేటా సిటీగా విశాఖ ఎదుగుతున్నది. కాగ్నిజెంట్, టీసీఎస్ వంటి సంస్థలు తమ కార్యకలాపాలు ప్రారంభించడంతో విశాఖ వైపు ప్రముఖ ఐటీ కంపెనీల చూపు మళ్లింది.

ప్రస్తుతం విశాఖలో 150కి పైగా టెక్ కంపెనీలు కార్యకలాపాలు కొనసాగిస్తుండగా రాష్ట్రంలో ఐటీ నిపుణులకు విస్తృతంగా అవకాశాలు పెరిగాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ 18 నెలల్లో ఒక్క విశాఖలోనే రూ.1.34 లక్షల కోట్ల భారీ పెట్టుబడులు వచ్చాయి.

Related posts

రేప్ లు మర్డర్ల నుంచి గొడ్డలి ఫొటో వరకూ…

Satyam News

జనరల్ ఇన్సూరెన్స్ పరిహారం చెక్కులు ఇవిగో…

Satyam News

అయిజలో అంతర్జాతీయ మహిళా కబడ్డీ టోర్నమెంట్

Satyam News

జగన్‌-భారతి స్కెచ్‌కు విజయమ్మ బ్రేకులు..ఆస్తి వివాదంలో ట్విస్ట్‌!

Satyam News

బాలలను పనుల్లో వినియోగిస్తే చట్టపరమైన చర్యలు

Satyam News

ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తజనం

Satyam News

Leave a Comment