26.7 C
Hyderabad
September 20, 2026
ప్రత్యేకంహోమ్

ఆ పార్టీల పొత్తు కోసం జగన్‌ ఆరాటం…

#Jagan

సింగిల్‌ సింహం జట్టు కట్టడానికి సై అంటోంది. కలిసొచ్చే పార్టీలతో పొత్తులకు రెడీ అని సిగ్నల్‌ ఇస్తోంది. అదేనండీ.. సింహం సింగిల్‌గా వస్తుందని చెప్పుకొనే వైసీపీ.. పొత్తు ప్రయత్నాల్లో బిజీగా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరో పదిహేనేళ్ల పాటు కలిసే ఉంటామని అధికార కూటమి పార్టీల ముఖ్య నేతలు స్పష్టంగా చెబుతున్నారు.

బలమైన కూటమిని ఎదుర్కోవాలంటే.. తమ వైపు కూడా ఒక జట్టుని తయారు చేసుకోవాలని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక్కడ సమస్య ఏమిటంటే.. వైసీపీ కూటమిలో చేరడానికి ఏపీలోని ప్రధాన పార్టీలు సిద్ధంగా లేవు. కూటమిలోని మూడు పార్టీలు.. కాకుండా ఏపీలో యాక్టివ్‌గా ఉన్న పార్టీల లిస్టులో కాంగ్రెస్, వామపక్షాలు ఉన్నాయి.

అయితే ఈ పార్టీలన్నీ కలిసినా.. ఒకటి రెండు శాతం కంటే ఎక్కువ ఓట్లు సాధించే సత్తా లేదు. వైసీపీ అధినేత జగన్‌రెడ్డి చెప్పుకోలేని అసలు సిసలైన ఇబ్బంది ఏమిటంటే.. కాంగ్రెస్‌ లేదా లెఫ్ట్‌ పార్టీలతో వైసీపీ‌ చేతులు కలపడం.. బీజేపీకి అస్సలు నచ్చదు.

ఢిల్లీ పెద్దలకు కోపం వస్తే ఏం జరుగుతుందో.. జగన్‌తో పాటు ఫ్యాన్‌ పార్టీ ఫ్యాన్స్‌ అందరికీ బాగా తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో పొత్తులకు వైసీపీ సిద్ధం అంటూ ఆ పార్టీ అనుకూల మీడియాలో వస్తున్నవన్నీ గాలి వార్తలే అని చెప్పుకోవచ్చు. బీజేపీతో సీక్రెట్‌ స్నేహం.. గతంలో జగన్‌రెడ్డికి పెద్ద ప్లస్‌ పాయింట్.

ఇప్పుడు మాత్రం అదే భారీ బలహీనతగా మారింది. మాకూ ఓ కూటమి ఉందని చెప్పుకోవాలంటే.. జడ శ్రావణ్‌ జై భీమ్‌ పార్టీ లాంటివి తప్ప.. వైసీపీకి వేరే ఆప్షన్ష్‌ లేవు. ఇవన్నీ తెలిసినా.. బ్లూ మీడియా మాత్రం జనాల చెవిలో పూలు పెట్టడానికి.. రోజుకో కొత్త కథ క్రియేట్‌ చేసి వదులుతుంది. వై నాట్ వన్‌ సెవెన్టీ ఫైవ్‌ అంటే గుడ్డిగా నమ్మిన వాళ్లు ఏమయ్యారో.. ఈ కొత్త కథలను నమ్మిన వాళ్లకు అదే గతి పడుతుంది. వైసీపీలో చాలా మంది అభిప్రాయం కూడా ఇదేనట.

Related posts

వైభవంగా శ్రీ మాధవరాయ మహోత్సవం

Satyam News

ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలి

Satyam News

భూ భారతి భూ సర్వే అవగాహనా కార్యక్రమంలో స్పీకర్

Satyam News

కల్తీ నెయ్యిపై మరో కమిటీ..నిర్ణయం సరైనదేనా?

Satyam News

జమాత్-ఎ-ఇస్లామీ సంస్థ పై ఎన్ ఐఏ దాడులు

Satyam News

సీనియర్ జర్నలిస్ట్ కనకంటి భూమయ్యకు పరామర్శ

Satyam News

Leave a Comment