24.7 C
Hyderabad
September 22, 2026
నెల్లూరుహోమ్

అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా ఫతేఖాన్‌పేట పోలీస్ క్వార్టర్స్

#FatheKhanPet

నెల్లూరు రూరల్ 36వ డివిజన్ పరిధిలో ఉండే ఫతేఖాన్‌పేటలో శిధిలా వ్యవస్థలో ఉన్న పోలీస్ క్వాటర్స్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిపోయింది. సాయంత్రం 7  దాటితే పోలీసు క్వార్టర్స్ లో ఉన్న  బ్లాక్ లలో యువత మద్యం సేవిస్తూ మద్యం సేవించిన సీసాలను  పగలకొడుతూ రచ్చ చేస్తున్నారు.

మరి కొంత మంది జూదగాళ్లు గంజాయి కొడుతూ పేకాట అచ్చ బొమ్మ మొదలైనటువంటి జూదానికి సంబంధించిన  ఆటలాడుతున్నారు. మరి కొంత మంది క్వార్టర్స్ లో  పరుపులు దిండులు వేసుకొని అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కంటి చూపు మేరలో డీఎస్పీ కార్యాలయం, పోలీస్ అసోసియేషన్ కార్యాలయం ఉన్నప్పటికీ యువత ఎటువంటి భయం లేకుండా పోలీస్ క్వార్టర్సుల్లోనే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం బాధాకరమని స్థానికులు అంటున్నారు.

పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్ కి సంబంధించిన ఎక్స్పైర్ డేట్ అయిన మందులను ఆ క్వాటర్స్ లో పడవేయడం కూడా జరుగుతున్నది. విచ్చలవిడిగా పడేసిన మందులు తెలిసో తెలియకో ఎవరో ఒకరు వాడినా అక్కడికి వచ్చే మద్యం సేవించిన వారు వాటిని తీసుకున్న వాటి వల్ల ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.

క్వాటర్స్ కి సంబంధించిన ఇనుప తలుపులు, కిటికీలు ధ్వంసం చేసి మరి దుండగులు తీసుకోని వెళ్ళుతున్నారు. శిథిల వ్యవస్థలో ఉన్న పోలీస్ క్వార్టర్స్ లను పడగొట్టి ప్రజలకు ఉపయోగకరమైనది ఏదో ఒకటి నిర్మిస్తే చుట్టుపక్కల ఉండే ప్రజలకు కూడా ఎంతో మేలు చేకూరుతుంది.

లేదా ఇటువంటి కార్యకలాపాలకు జరగకుండా ప్రత్యామ్నాయ మార్గం చూసి చర్యలు తీసుకోవాలని జిల్లా SP  గ్రీవెన్స్ ద్వారా కోరడం జరిగింది. ఈ మేరకు నెల్లూరు రూరల్ వైస్సార్సీపీ 36వ డివిజన్ ఇంచార్జ్ బాబీ భగత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.

Related posts

రాష్ట్రంలో కోరమండల్ పెట్టుబడి రూ.2,000 కోట్లు

Satyam News

షోలింగర్ యోగ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి లోకేష్

Satyam News

తెలుగు ఇండస్ట్రీకి మరో యువ హీరో దొరికాడు

Satyam News

ఇంత డబ్బు ఎక్కడ నుండి వచ్చింది నారాయణ?

Satyam News

విజ‌య‌న‌గ‌రం జిల్లా  పోలీస్ ఆఫీస్ లో ఓపెన్ హౌస్

Satyam News

చౌడేశ్వరి హత్య కేసులో సీఐ సస్పెన్షన్

Satyam News

Leave a Comment