25.2 C
Hyderabad
September 20, 2026
శ్రీకాకుళంహోమ్

అడ్వకేట్స్‌ కు జుడీషియల్‌ అకాడమి పెట్టాలి

#AASRAA

అడ్వకేట్స్‌కు జుడీషిల్‌ అకాడమీ స్థాపించాలని ఆశ్రా జాతీయ ఫౌండర్‌ అధ్యక్షులు, సుప్రీం కోర్టు న్యాయవాది,  హబీబ్‌ హలీ సుల్తాన్‌ కోరారు. ఈ మేరకు శ్రీకాకుళం నగరంలోని జిల్లా ఆశ్రా కార్యాలయంలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. త్వరలో జరగనున్న రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తన విజయానికి సహకరించాలని న్యాయవాదులను ఆయన కోరారు. 

ఈ సంస్థను 2016లో స్థాపించడం జరిగిందని దీని ద్వారా అన్ని వర్గాల  ప్రజలకు న్యాయపరంగా ఎదురయ్యే ఇబ్బందులను ఎలాంటి ఆర్థికంగా ఆశించకుండా తమ సంస్థ ద్వారా సమస్యలు పరిష్కరించేందుకు చొర తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా తమ సంస్థ ద్వారా బాధితుల హక్కుల రక్షణ కొరకు రాజ్యాంగ బద్ధంగా న్యాయం జరిగేలా తాము కృషి చేస్తున్నామన్నారు.

ఇప్పటికే 230కేసులకు పైగా బాధితులకు న్యాయం చేయగలిగామన్నారు.  ఆశ్రా  ద్వారా 2,800ల కు పైగా కేసులను అవగాహన సదస్సులు నిర్వహించామన్నారు. ఇప్పటికే తమ సంస్థ 9 రాష్ట్రాల్లో విస్తరించిందన్నారు.  అధికంగా  శ్రీకాకుళం జిల్లాలో అవగాహన సదస్సులు నిర్వహించామన్నారు. ఆశ్రా ప్రతీ ఏడాది ఒక్కోరాష్ట్రంలో పెద్ద సమావేశం నిర్వహించి న్యాయ సలహాలు అందిస్తున్నామన్నారు.

తమ సంస్థలో పదవిలా కాకుండా ఒక సేవా సంస్థగా పనిచేస్తుందన్నారు. ప్రస్తుతం తాను ఆంధ్రప్రదేశ్‌ బార్‌ కౌన్సిల్‌ సభ్యత్వానికి పోటీ లో ఉన్నానన్నారు. తమ సంస్థ అందిస్తున్న సేవలను జిల్లాలోని అందరి అడ్వకేట్‌లకు వివరించడం జరుగుతుందన్నారు.  యువ న్యాయవాదులకు కేసులపై అవగాహన కల్పించే వేదిక ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానన్నారు.

ఆశ్రా ద్వారా ఏడాదికి 200లకు పైగా యువ న్యాయవాదులకు అవగాహన విధానాలను వివరించడం జరుగుతుందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏడాదికి 500 మంది యువ న్యాయవాదులను ఆశ్రాలోకి తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. యువ న్యాయవాదుల ద్వారానే కేసులను ఫైల్‌ చేసి అవగాహన కల్పిస్తామన్నారు.

ఈ సమావేశంలో శ్రీకాకుళం జిల్లా ఆశ్రా అధ్యక్షులు, అడ్వకేట్‌ డాక్టర్‌. గంజి ఆర్‌ ఎజ్రా, ఉపాధ్యక్షులు, వాకర్స్‌ ఇంటర్నేషనల్‌ మాజీ గవర్నర్‌, న్యాయవాది. జి. ఇందిరా ప్రసాద్‌, అడ్వకేట్‌ పార్థశారధి, కార్యవర్గ సభ్యులు బాలకృష్ణ, నీలి కిరణ్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.

Related posts

ఆదిలో భారమైనా ఆ తర్వాత అంతా లాభమే

Satyam News

రంగా, వైఎస్.. వివేకానందరెడ్డి మరణాలతో లాభపడింది ఎవరు..??

Satyam News

లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు: రాజ్‌ కెసిరెడ్డి, వాసుదేవరెడ్డి అరెస్టు

Satyam News

నేటి నుంచి టాలీవుడ్‌లో షూటింగ్స్ బంద్

Satyam News

కేరళ రాష్ట్రం పేరును ఎందుకు మారుస్తున్నారో తెలుసా?

Satyam News

ఏపీ సర్కార్‌పై సంచలన సర్వే… చంద్రబాబు, పవన్‌, లోకేష్‌ షాక్‌

Satyam News

Leave a Comment