26.3 C
Hyderabad
September 19, 2026
ముఖ్యంశాలుహోమ్

బంగ్లాదేశ్‌లో అరెస్టైన మత్స్యకారుల విడుదలకు తక్షణ చర్యలు

#Chandrababu

విజయనగరం జిల్లాకు చెందిన 9 మంది మత్స్యకారులను బంగ్లాదేశ్ నౌకాదళం అరెస్టు చేసిన ఘటనను రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లగా, దీనిపై ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కి లేఖ రాసి మత్స్యకారుల విడుదలకు అవసరమైన దౌత్య చర్యలు చేపట్టాలని కోరారు.

ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు విజయవాడలోని క్యాంప్ కార్యాలయం నుండి మాట్లాడుతూ, విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌కు చెందిన మెకానైజ్డ్ ఫిషింగ్ బోట్ (రిజిస్ట్రేషన్ నెం. INDAP-V5-MM-75) అక్టోబర్ 13, 2025న ఉదయం 4 గంటలకు లోతు సముద్ర చేపల వేటకు బయలుదేరిన సమయంలో, అందులో ఉన్న 9 మంది మత్స్యకారులు వాతావరణ పరిస్థితులు, సముద్ర ప్రవాహాల కారణంగా అనుకోకుండా అంతర్జాతీయ సరిహద్దులు దాటారని తెలిపారు.

ఈ క్రమంలో బంగ్లాదేశ్ నౌకాదళం వారిని అరెస్టు చేసినట్లు వివరించారు. అక్టోబర్ 22, 2025న సమీప ప్రాంతంలో వేట చేస్తున్న మరో పడవ సిబ్బంది ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చిందని, అప్పట్లో పడవ డ్రైవర్ బంగ్లాదేశ్ నౌకాదళం తమను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపినట్లు మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

ఈ అంశాన్ని సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లగానే, మత్స్యకారుల కుటుంబాల పరిస్థితిని పరిగణలోకి తీసుకుని ముఖ్యమంత్రి వెంటనే స్పందించారని, కేంద్ర విదేశాంగ, హోంశాఖల ద్వారా బంగ్లాదేశ్ ప్రభుత్వంతో దౌత్య పరమైన చర్చలు జరిపి మత్స్యకారులు వారి పడవను సురక్షితంగా విడుదల చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ని కోరుతూ లేఖ రాసినట్లు తెలిపారు.

కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి అందిన సమాచారం ప్రకారం, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 13 మంది, పశ్చిమ బెంగాల్‌లో 122 మంది బంగ్లాదేశ్ మత్స్యకారులు నిర్బంధంలో ఉన్నారని, పరస్పర విడుదల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఈ అంశాన్ని మానవతా దృక్పథంతో త్వరితగతిన పరిష్కరించాలని సీఎం చంద్రబాబు కోరినట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.

బంగ్లాదేశ్‌లో అరెస్టయిన 9 మంది మత్స్యకారుల కుటుంబాలు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నాయని పేర్కొన్న మంత్రి అచ్చెన్నాయుడు, రాష్ట్ర ప్రభుత్వం వారి పక్షాన నిలబడి కేంద్రంతో నిరంతరం సమన్వయం చేస్తూ మత్స్యకారుల త్వరిత విడుదల కోసం కృషి చేస్తుందని స్పష్టం చేశారు.

Related posts

సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు

Satyam News

నాలుగు దశాబ్దాల మావో పోరాటానికి ముగింపు

Satyam News

జగన్‌ని అవమానించిన  బొత్స సత్యనారాయణ

Satyam News

ట్రంప్ విధానాలపై అమెరికా లో నిరసనల హోరు

Satyam News

ఖాళీ పేజీలు, మ్యాన్యువల్ మార్కులు..APPSC స్కామ్‌లో నిజాలు!

Satyam News

మైనర్ బాలిక తల్లి బహిరంగ ప్రకటన ఇది….

Satyam News

Leave a Comment