25.2 C
Hyderabad
September 20, 2026
పశ్చిమగోదావరిహోమ్

చింతపల్లి శ్రీనివాసరావుకు రితిక ఫౌండేషన్ సత్కారం

#RitikaFoundation

జర్నలిజం లో 20 ఏళ్లుగా విధులు నిర్వహిస్తూ ఎన్నో సామాజిక సేవల లో భాగస్వామ్యుడై జిల్లాలో పలువురు రాజకీయ ప్రముఖులు, జిల్లా అధికారులు,పారిశ్రామిక వేత్తల మన్ననలు పొందిన ఏలూరు జిల్లా న్యూస్ రైట్ బ్యూరోగా భాద్యతలు వహిస్తున్న చింతపల్లి శ్రీనివాసరావుకు రితిక ఫౌండేషన్  గుడివాడలోని ఎ.పి.ఎన్.జి.ఓస్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో అరుదైన గౌరవం లభించింది.

ఈ సందర్భంగా శ్రీనివాస్ ని  “బెస్ట్ సోషల్ వర్క్ గా ప్రకటించి రితిక ఫౌండేషన్ 2026 కి గాను ఈ అవార్డ్స్ అందజేసింది. కార్యక్రమంలో సమాజ సేవలో విశేష కృషి చేస్తున్న పలువురిని సన్మానించారు. సేవాభావం, ప్రజలకు అందిస్తున్న నిస్వార్థ సేవలను గుర్తిస్తూ నంది అవార్డులు మరియు బెస్ట్ సోషల్ వర్క్ అవార్డులను ప్రదానం చేసి, శాలువాతో ఘనంగా సత్కరించి ప్రశంసాపత్రాలు, మెమెంటోలు అందజేశారు.

ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ రితిక ఫౌండేషన్ చేస్తున్న సేవలు అద్భుతమని, ముఖ్యంగా అనాధ పిల్లల పట్ల వారు చూపుతున్న సేవాభావాన్ని కొనియాడారు. సమాజసేవ మరియు వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించి సన్మానించడం పట్ల స్థానికులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా డాక్టర్ మనోజ్, అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి పేదలకు చేస్తున్న నిస్వార్థ సేవలను వక్తలు ప్రశంసించారు. రాజకీయ నాయకులు మాటల్లోనే ఉంటారని, కానీ డాక్టర్ మనోజ్ మాటలకంటే చేతల్లోనే సేవ చూపిస్తున్నారని, వైష్ణవి చిన్ననాటి నుంచే సేవాభావంతో వైద్య విద్యను అభ్యసిస్తూ భవిష్యత్తులో సమాజానికి అంకితమవ్వాలనే తపనతో ఉన్నారని కొనియాడారు.

ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్న డాక్టర్ మనోజ్, అంబుల వైష్ణవి అమరావతి నిర్మాణానికి ప్రతి ఒక్కరూ క్యూఆర్ కోడ్ ద్వారా రూ.116 విరాళం అందించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు స్వచ్ఛందంగా స్కాన్ చేసి విరాళాలు అందజేశారు. వారికి డాక్టర్ మనోజ్, వైష్ణవి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లాకు చెందిన జర్నలిస్ట్ మరియు సోషల్ వర్కర్ చింతపల్లి శ్రీనివాసరావు  “బెస్ట్ సోషల్ వర్క్ అవార్డు – 2026” తో సన్మానించి, మెమెంటో, బొకే, ప్రశంసాపత్రం అందజేశారు.

Related posts

బిగ్ బాస్ ఇక దొరికినట్లేనా?

Satyam News

యువత గొంతు నొక్కితే బీజేపీ రాజకీయ పతనం తప్పదు

Satyam News

శ్త్రీ శక్తి డిజిటల్ మహానాడుకు అనంతపురంలో ఘన ఏర్పాట్లు

Satyam News

బురఖా డ్యాన్స్: ప్రయివేట్ స్కూల్ ను సీజ్ చేసిన అధికారులు

Satyam News

నటకిరీటి డా: రాజేంద్ర ప్రసాద్ “నేనెవరు?” టైటిల్ లోగో లాంచ్

Satyam News

జూలై నెలలో శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు

Satyam News

Leave a Comment