26.3 C
Hyderabad
September 19, 2026
కృష్ణహోమ్

అమిత్‌ షాతో బాబు భేటీ…. వైసీపీలో మొదలైన టెన్షన్.!

#AmitShah

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇవాళ అమిత్ షా సహా వరుసగా ఐదుగురు కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఇటీవల కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు , విభజన హామీలపై చర్చించనున్నారు.

ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు నిధులు, రైల్వే జోన్, వ్యవసాయ రంగానికి సంబంధించిన కీలక అంశాలను ఆయా కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లనున్నారు.ఇక, ఈ పర్యటనలో అత్యంత కీలకమైంది చంద్రబాబు – అమిత్ షా సమావేశం. ఈ సమావేశంలో నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల అంశమే కాకుండా ఇతర అంశాలు కూడా ప్రస్తావనకు రానున్నాయి.

ప్రధానంగా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, కల్తీ లడ్డూ, లిక్కర్ స్కామ్‌ అంశాల విచారణపైనా చర్చిస్తారని తెలుస్తోంది. అమిత్ షాతో భేటీ తర్వాత ఏపీలో కీలకమైన రాజకీయ పరిణామాలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ చంద్రబాబు భేటీ కానున్నారు.

రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల విడుదల, రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపులపై చర్చించనున్నారు. దీంతో పాటు జల్‌ శక్తి, రైల్వే శాఖ, వ్యవశాయ శాఖ మంత్రులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. తిరిగి సాయంత్రం అమరావతికి చేరుకోనున్నారు చంద్రబాబు.

ఇక చంద్రబాబు ఢిల్లీ పర్యటన, అమిత్ షాతో భేటీతో వైసీపీలో ఆందోళన మొదలైంది. ఇప్పటికే తిరుమల శ్రీవారి కల్తీ నెయ్యి వివాదం, సిట్ విచారణలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఫ్యాన్ పార్టీ నేతలు చంద్రబాబు ఢిల్లీ టూర్‌తో మరింత ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.

Related posts

అమెరికాకు గట్టిగా బుద్ధి చెప్పనున్న భారత్

Satyam News

ఫారెక్స్ నిల్వల్లో ప్రపంచంలో నాలుగో స్థానానికి చేరిన భారత్

Satyam News

ఇమ్రాన్ ఖాన్ భార్యకు 17 ఏళ్ల జైలు శిక్ష

Satyam News

మృతుని కుటుంబానికి అండగా నిలిచిన మాధవి రెడ్డి

Satyam News

నటి దేవీప్రియ కారుకు ప్రమాదం..డ్రైవర్ మృతి…

Satyam News

రోడ్డు ప్రమాదంలో హోంగార్డ్ మృతి

Satyam News

Leave a Comment