25.2 C
Hyderabad
September 20, 2026
ప్రత్యేకంహోమ్

మరింత తగ్గనున్న వైసీపీ సీట్లు, ఓట్లు….!!

#Jagan

అధికారం చేతికి వస్తే.. ఏ పార్టీకైనా అలసత్వం.. నిర్లక్ష్యం వంటి అవలక్షణాలు ఆవహిస్తాయి. కానీ ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారధ్యంలోని కూటమి ప్రభుత్వానికి.. అధికారం మరింత ఉత్సాహాన్నిచ్చింది. 20 నెలల తర్వాత కూడా రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీల జోరు తగ్గలేదు.

కూటమి పార్టీల ప్రజాదరణ మరింత పెరిగింది. ఈ విషయాన్ని జాతీయ సర్వే సంస్థ సీ ఓటర్‌.. పక్కా లెక్కలతో సహా వివరించింది. 2024 ఎన్నికల్లో ప్రత్యర్ధి వైసీపీ మీద 16 శాతం ఓట్ల తేడాతో గెలిచిన కూటమి.. ఇప్పుడు ఎన్నికలు జరిగితే 20 శాతం ఎక్కువ ఓట్లు సాధించి.. మళ్లీ 160 ప్లస్‌ సీట్లు సాధిస్తుందని సీ ఓటర్ సర్వే ఫలితాలు తెలియజేస్తున్నాయి.

అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ పరిస్థితి మరింత దిగజారిపోయింది. గత ఎన్నికల్లో సాధించిన ఓట్లలో కనీసం 5 శాతం పోగొట్టుకొందని.. సర్వేలో తేలింది. అప్పట్లో అధికారంలో ఉండటంతో.. కొంత మంది వైసీపీకి జై కొట్టినా.. పవర్‌ పోయిన తర్వాత.. చాలా మంది నాయకులు, కార్యకర్తలు ఫ్యాన్‌ పార్టీని వదిలేసి కూటమి పార్టీల్లోకి జంప్‌ చేయడమే.. వైసీపీ డౌన్‌ ట్రెండ్‌కి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

ఇక కూటమి పార్టీల ఐక్యతే వారికి బలంగా ఉంది. చిన్న చిన్న సమస్యలు ఉన్నా.. పై స్థాయి నుంచి కార్యకర్తల వరకు సమన్వయంతో ముందకు వెళ్తూ ఉండటంతో కూటమి ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదు. విపక్షం నుంచి చేరికలతో.. కూటమి బలం మరింత పెరిగింది. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల పట్ల ప్రజలు సంతృప్తితో ఉన్నారని ఈ సర్వే ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.

ఇక రెండేళ్ల క్రితం ఎన్నికల ముందు నారా లోకేశ్‌ పార్టీలో కీలకంగా ఉన్నా సీఎం రేసులో లేరు. కానీ యువగళం పాదయాత్రతో పార్టీని ముందుండి నడిపించిన తీరు.. అధికారంలోకి వచ్చాక.. ప్రభుత్వంలో క్రియాశీలకంగా పని చేస్తూనే నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉండటం.. పిలిచిన వెంటనే పలుకుతారు.. అడిగితే కాదనకుండా సాయం చేస్తారనే పేరు సంపాదించుకొన్నారు.

ఈ కారణంతోనే చంద్రబాబు తర్వాత పార్టీ వారసుడు.. ముఖ్యమంత్రి అభ్యర్ధిగా నారా లోకేశ్‌కి తెలుగుదేశం శ్రేణులు నూటికి నూరు శాతం జైకొడుతున్నాయి. ఎన్నో కష్టాలు ఎదుర్కొని.. మరెన్నో అవమానాలు భరించి.. సమస్యలను అధిమించిన నారా లోకేశ్‌.. టీడీపీ ఫ్యూచర్‌ లీడర్‌గా ఎదిగారు. సీ ఓటర్‌ సర్వే ఫలితాలను విశ్లేషించిన జాతీయ మీడయాలో.. లోకేశ్‌ సక్సెస్‌ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు

Related posts

జెఫ్రీ ఎప్ స్టిన్ మాజీ ప్రేయసికి రూ.850 కోట్లకు పైగా ఆస్తి?

Satyam News

నేను రావద్దు అన్న వారినే ముంబయి తరిమికొట్టింది

Satyam News

కరీంనగర్ పోలీస్ కమిషనర్ పై సంచలన ఆరోపణలు

Satyam News

ఒంటిమిట్ట అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక

Satyam News

ఏపిలో ఐఏఎస్ లకు పోస్టింగ్ లు

Satyam News

ఫైనల్ కు దూసుకెళ్లిన న్యూజిలాండ్

Satyam News

Leave a Comment