26.3 C
Hyderabad
September 19, 2026
ప్రపంచంహోమ్

హ్యూమన్ ట్రాఫికింగ్‌ కేసులో వైసీపీ కార్యకర్త..అమెరికాలో అరెస్టు.!

#SuhrutReddyChada

వైసీపీ కార్యకర్తల అరాచకాలు కేవలం ఏపీకే పరిమితం కాలేదు..ఇప్పుడు సప్త సముద్రాలు దాటి ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. ఏపీలో అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయిన ఫ్యాన్ బ్యాచ్, ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లోనూ నేరాలకు పాల్పడుతున్నారు. జార్జియాలో నిర్వహించిన భారీ హ్యూమన్ ట్రాఫికింగ్ నిరోధక స్టింగ్ ఆపరేషన్‌లో వైసీపీ కార్యకర్త సుహృత్ రెడ్డి పోలీసులకు చిక్కడం తెలుగు కమ్యూనిటీలో సంచలనంగా మారింది.

జనవరి 29, 30 తేదీల్లో అట్లాంటా పోలీసులు అత్యంత రహస్యంగా ‘ఆపరేషన్ శాండీ స్ప్రింగ్స్ గార్డియన్’ పేరుతో స్పెషల్‌ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. వ్యభిచార ముఠాలు, మానవ అక్రమ రవాణా లక్ష్యంగా జరిగిన ఈ దాడుల్లో అట్లాంటా శివారు ప్రాంతాల్లోని హోటళ్లపై దాడులు చేశారు. ఈ క్రమంలో అక్రమ లైంగిక కార్యకలాపాలకు పాల్పడుతూ, మానవ అక్రమ రవాణా ముఠాలతో సంబంధాలు కలిగి ఉన్నాడన్న ఆరోపణలతో సుహృత్ రెడ్డితో సహా మరో ఎనిమిది మందిని అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సుహృత్ రెడ్డి కేవలం ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మాత్రమే కాదు, వైసీపీకి స్ట్రాంగ్ సపోర్టర్. ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో వైసీపీ పార్టీ తరపున పెద్ద ఎత్తున ప్రచారం చేశాడని నెటిజన్లు ఫోటోలతో సహా బయటపెడుతున్నారు. వైసీపీ అరాచక సంస్కృతి దేశం దాటి అమెరికా దాకా పాకిందంటూ సెటైర్లు వేస్తున్నారు.

అమెరికా చట్టాల ప్రకారం హ్యూమన్ ట్రాఫికింగ్ లాంటి కేసుల్లో దొరికితే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. సుహృత్ రెడ్డిపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దీనివల్ల అతడికి భారీ జైలు శిక్ష పడటమే కాకుండా, వీసా రద్దయ్యి శాశ్వతంగా అమెరికా నుంచి గెంటివేసే – డిపోర్టేషన్ ప్రమాదం పొంచి ఉంది. చదువుకున్న వారు ఇలాంటి దారుణాలకు పాల్పడుతూ విదేశాల్లో తెలుగు వారి పరువు తీయడంపై అక్కడి కమ్యూనిటీ మండిపడుతోంది

Related posts

తూర్పుగోదావరి జిల్లా లో రోడ్డు ప్రమాదం

Satyam News

చంద్రబాబు జన్మదినం సందర్భంగా అన్న క్యాంటీన్ల కు రూ.76 లక్షల విరాళం

Satyam News

తహసీల్దార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు

Satyam News

చంద్రబాబుకు షాక్ ఇచ్చిన క్రిమినల్స్!

Satyam News

రాష్ట్ర బడ్జెట్ ప్రతులకు ప్రత్యేక పూజ

Satyam News

కవిత భూదాన్ హంగామా: పోలీసు, ప్రభుత్వ యంత్రాంగం బిత్తరపాటు

Satyam News

Leave a Comment