క్రీడలుహోమ్

ఫైనల్ కు దూసుకెళ్లిన న్యూజిలాండ్

#NewZealand

టి20 వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో ఫిన్ అలెన్ సూపర్ సెంచరీతో న్యూజిలాండ్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. కేవలం 33 బంతుల్లోనే అజేయంగా 100 పరుగులు చేసిన అలెన్ దక్షిణాఫ్రికా బౌలర్లను పూర్తిగా మట్టికరిపించాడు. అతని ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. ఓపెనింగ్ భాగస్వామి టిమ్ సైఫర్ట్ 58 పరుగులతో కీలక సహకారం అందించాడు.

వీరిద్దరి ధాటికి న్యూజిలాండ్ 170 పరుగుల లక్ష్యాన్ని కేవలం 12.5 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టంతో చేధించింది. ఇంకా 43 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను ముగించింది. దక్షిణాఫ్రికా తరఫున కగిసో రబడా ఒక్క వికెట్ మాత్రమే తీసి 28 పరుగులు ఇచ్చాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులు చేసింది.

ఒక దశలో 11వ ఓవర్లో 5 వికెట్లకు 77 పరుగుల వద్ద కష్టాల్లో పడిన జట్టును మార్కో జాన్సెన్ అద్భుతంగా నిలబెట్టాడు. 30 బంతుల్లో అజేయంగా 55 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. అతని ఇన్నింగ్స్‌లో 2 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. డేవాల్డ్ బ్రెవిస్ 34 పరుగులు, ట్రిస్టన్ స్టబ్స్ 29 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో రచిన్ రవీంద్ర, కోల్ మెక్‌కాన్చీ, మ్యాట్ హెన్రీ తలా రెండు వికెట్లు తీశారు.

సంక్షిప్త స్కోర్లు:

దక్షిణాఫ్రికా – 20 ఓవర్లలో 169/8 (మార్కో జాన్సెన్ 55, డేవాల్డ్ బ్రెవిస్ 34; రచిన్ రవీంద్ర 2/29, కోల్ మెక్‌కాన్చీ 2/9, మ్యాట్ హెన్రీ 2/34)

Related posts

ఢిల్లీ అల్లర్ల నిందితులకు సుప్రీం కోర్టు బెయిల్

Satyam News

మీరట్ లో ఘోర ప్రమాదం: 5 గురు చిన్నారులు మృతి

Satyam News

కలెక్టర్ హిమాన్షు చర్యలతో మత్స్యకారుల్లో విశ్వాసం

Satyam News

ఘనంగా ముగిసిన జిల్లా పోలీసు వార్షిక క్రీడా సంబరాలు

Satyam News

కడపలో అర్ధరాత్రి దారుణం: ఇల్లు నేలమట్టం

Satyam News

స్థానిక ఎన్నికలలో జనసేన అన్ని స్థానాలలో పోటీకి సిద్ధం

Satyam News

Leave a Comment