26.7 C
Hyderabad
September 20, 2026
సంపాదకీయంహోమ్

పాలెగాళ్ల ‘డిజిటల్ ఫ్యాక్షనిజం’.. హెరిటేజ్ మీద వ్యవస్థీకృత కుట్ర!

రాయలసీమ పాలెగాళ్ల చరిత్రలో ఫ్యాక్షన్ రాజకీయాలకు ఒక చీకటి అధ్యాయం ఉంది. ఆనాడు పగవాడిని దెబ్బతీయడానికి ప్రత్యర్థి పొలాల్లోకి చొరబడి, రాత్రికి రాత్రే పంటను తగలబెట్టడం, ఏళ్ళ తరబడి పెంచిన తోటలను నరకడం, బావుల్లో విషం కలపడం వంటి కిరాతక పద్ధతులను అనుసరించేవారు.

నాడు కత్తులు, గొడ్డళ్లతో సాగిన ఆ విద్వేషం, నేడు స్మార్ట్ ఫోన్లు మరియు ఫేక్ సోషల్ మీడియా హ్యాండిల్స్ రూపంలో రూపాంతరం చెందింది.అప్పటి ఫ్యాక్షనిస్టులు చీకటి పడే వరకు ఆగి పొలాలను తగులబెడితే, నేటి “డిజిటల్ ఫ్యాక్షనిస్టులు” తెల్లవారుజామున 3 గంటలకు సోషల్ మీడియాలో అబద్ధపు వార్తలను వదులుతున్నారు.

ఉదయం 9 గంటలకు స్టాక్ మార్కెట్ మొదలయ్యే సమయానికి హెరిటేజ్ వంటి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ షేర్ విలువను పాతాళానికి తొక్కాలనేది వీరి నీచమైన వ్యూహం. ఇది కేవలం రాజకీయ విమర్శ కాదు, ఇది ఒక వ్యవస్థీకృత ఆర్థిక విధ్వంసం.

మహారాష్ట్రకు చెందిన ఇందాపూర్ డైరీకి, హెరిటేజ్ సంస్థకు ఎలాంటి యాజమాన్య సంబంధాలు లేవని, అసలు టీటీడీకి హెరిటేజ్ ఎప్పుడూ నెయ్యి సరఫరా చేయలేదని ఆధారాలతో సహా స్పష్టమవుతున్నా. వైసీపీ అనుబంధ మీడియా సంస్థలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగాలు పనిగట్టుకుని చేస్తున్న ప్రచారం వారి రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం.

గతంలో ప్రత్యర్థి ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు పశువులను చంపడం, నీటి వనరులను కలుషితం చేయడం వంటి చర్యలకు పాల్పడేవారు. నేడు అదే పద్ధతిని డిజిటల్ మాధ్యమంలో అమలు చేస్తున్నారు.

తమ హయాంలో జరిగిన నెయ్యి కల్తీ పాపాలను కప్పిపుచ్చుకోవడానికి టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మొదలెట్టిన ఈ విష ప్రచారాన్ని భుజానికెత్తుకున్న వారిని చూస్తుంటే జాలి వేస్తోంది. వీరికి తోడుగా “న్యూట్రల్” ముసుగు వేసుకున్న కొందరు మేధావులు, కమ్యూనిస్ట్ భావజాలం ముసుగులో బతుకుతున్న “నెలవారీ” పేమెంట్ జర్నలిస్టులు ఈ బురద జల్లడంలో భాగస్వాములు అవుతున్నారు.

వీరంతా ఒకటి గుర్తుంచుకోవాలి: రాజకీయ నాయకుల మీద, పార్టీల మీద వాగే వాక్ స్వాతంత్య్రం వేరు.. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల మీద ఇష్టం వచ్చినట్లు వాగితే జరిగే పరిణామాలు వేరు.హెరిటేజ్ సంస్థ వేయబోయే పరువునష్టం దావా విలువ ముందు వీరి ఆస్తులు అమ్మినా సరిపోవు.

అప్పుడు ఈ రాజకీయ యజమానులు వచ్చి వీరిని కాపాడరు. చూసీ చూడనట్లుగా వదిలేయక చట్టపరమైన చర్యలకు వెళితే ఒక్కోడి మెడకు చట్టం ఎలా చుట్టుకుంటుందో అప్పుడు తెలుస్తుంది.లక్షలాది మంది రైతులకు పాడి ద్వారా జీవనోపాధి కల్పిస్తూ, వేలాది మంది ఉద్యోగులకు ఆసరాగా ఉన్న ఒక ప్రతిష్టాత్మక సంస్థపై అబద్ధాలతో బురద జల్లడం అంటే.. వేలాది కుటుంబాల పొట్ట కొట్టడమే.

ఒక ఇన్వెస్టర్ సెంటిమెంట్ తో ఆడుకోవడం, తప్పుడు వార్తలతో మార్కెట్ ను ప్రభావితం చేయడం తీవ్రమైన నేరం. దీనిని “డిజిటల్ టెర్రరిజం” అని పిలవడంలో అతిశయోక్తి లేదు.నాడు ఫ్యాక్షన్ రాజకీయాలు ఏ ఒక్కరినీ బాగు చేయలేదు, నేటి ఈ డిజిటల్ కుతంత్రాలు కూడా చివరకు అబద్ధపు పునాదులపై కూలిపోక తప్పవు.

హెరిటేజ్ సంస్థ ఇప్పటికే చట్టపరమైన చర్యలకు సిద్ధమవ్వడం స్వాగతించదగ్గ పరిణామం. అబద్ధం ప్రచారం చేసిన నోళ్లు రేపు కోర్టు బోనులో నిజం ఒప్పుకోక తప్పదు.

Related posts

గుట్టలు గుట్టలుగా రద్దయిన నోట్లు

Satyam News

హిందూ సంప్రదాయాలను అవమానిస్తే కఠిన చర్యలు

Satyam News

సస్పెన్షన్ బాధతో ఏఎస్సై ఆత్మహత్య

Satyam News

తనకు రక్షణ కల్పించండంటూ గర్భిణి వేడుకోలు

Satyam News

విశాఖకి అమెజాన్‌..  ఐటీ ప్లస్‌ AWS డేటా సెంటర్‌..!

Satyam News

జగన్ APPSC గ్రూప్-1 ప్రక్రియలో వెలుగు చూసిన అక్రమాలు!

Satyam News

Leave a Comment