26.3 C
Hyderabad
September 19, 2026
విశాఖపట్నంహోమ్

విశాఖకి అమెజాన్‌..  ఐటీ ప్లస్‌ AWS డేటా సెంటర్‌..!

#VizagCity

విశాఖపట్నంలో ఐటీ ఎకోసిస్టమ్‌కి మరో భారీ బూస్ట్‌ ఇచ్చే న్యూస్‌. అదేంటంటే.. అమేజాన్‌ ఐటీ సెంటర్‌. ఇప్పటికే వైజాగ్‌లో టీసీఎస్, కాగ్నిజెంట్‌, యాక్సెంచర్‌ వంటి సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు.. గూగుల్‌, మెటా, రిలయన్స్‌ కంపెనీల డేటా సెంటర్లు ఏర్పాటు అవుతున్న విషయంలో తెలిసిందే.

ఇదే బాటలో ప్రపంచంలోని టాప్‌ ఫైవ్‌ టెక్నాలజీ కంపెనీల్లో ఒకటైన అమేజాన్‌ విశాఖలో ల్యాండ్‌ అయింది. సాఫ్ట్‌వేర్‌ అండ్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా సంస్థలో.. అమేజాన్‌ సంస్థ విశాఖ డెవలప్‌మెంటర్‌ సెంటర్‌ని రిజస్టర్‌ చేసింది. సాగర నగరంలో అమేజాన్.. భారీ ఐటీ సెంటర్‌ ఏర్పాటు చేయబోతున్నట్లు ఎస్‌టీపీఐ రిజిస్ట్రేషన్‌తో కన్షర్మేషన్‌ వచ్చినట్లయింది.

విశాఖలో ఏర్పాటు చేయబోయే ఐటీ డెవలప్‌మెంట్‌ సెంటర్లో సుమారు 900 ఉద్యోగాలు కల్పించడంతో పాటు ఏడాదికి 10 వేల కోట్ల విలువైన ఐటీ ఎగుమతులు చేస్తామని ప్రతిపాదించారు. ఈ కామర్స్‌ రంగంలో అమేజాన్‌ ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ అనే విషయం తెలిసిందే. ఆన్‌లైన్‌ మార్కెట్‌ ప్లేస్‌ని మేనేజ్‌ చేయడానికి.. కొత్త సేవలు అభివృద్ధి చేయడానికి విశాఖ డెవలప్‌మెంట్‌ సెంటర్లో నిపుణులను నియమించుకొంటారు.

అమేజాన్‌కి మార్కెట్‌ ప్లేస్‌ని మించిన మరో బిజినెస్‌ ఉంది. అదే అమేజాన్‌ వెబ్‌ సర్వీస్‌. ఇది క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సంస్థ. AWS ద్వారా ఐటీ కంపెనీలకు సర్వర్లు అద్దెకిస్తారు. ఈ సర్వర్లను మేనేజ్‌ చేయడానికి అమేజాన్‌ ప్రపంచ వ్యాప్తంగా భారీ డేటా సెంటర్లు నిర్వహిస్తోంది. ఏపీ డేటా సెంటర్‌ హబ్‌గా మారుతున్న సమయంలో.. గూగుల్‌, మెటాతో పాటు.. AWS డేటా సెంటర్‌ కూడా వైజాగ్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

వైజాగ్‌లో సముద్ర గర్భ కేబుల్స్‌ ల్యాండ్‌ అవుతున్నాయి. వీటికి సమీపంలోని డేటా సెంటర్లు అతి తక్కువ లేటెన్సీతో డేటాను ట్రాన్స్‌ఫర్ చేయగలవు. అందుకే ఈ కేబుల్స్‌ వేస్తున్న గూగుల్, మెటాతో పాటు ఇతర కంపెనీలు కూడా విశాఖలోనే డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాయి. ఈ లిస్టులో AWS చేరినా ఆశ్చర్య లేదని టెక్‌ నిపుణులు భావిస్తున్నారు.

Related posts

ఇంటర్ లో ఉత్తీర్ణులైన విద్యార్థుల కోసం.. .

Satyam News

హీట్ వేవ్ యాక్ష‌న్ ప్లాన్‌: అన్ని ప్రాంతాల్లో చ‌లివేంద్రాలు

Satyam News

వైభవంగా జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

Satyam News

మీ దగ్గరకొచ్చే చేనేత వస్త్రాలు కొంటాం

Satyam News

నటి ట్విషా శర్మ కేసును స్వీకరించిన సుప్రీంకోర్టు

Satyam News

బ్రిటన్ తో వాణిజ్య ఒప్పందం నేటి నుంచి అమలు

Satyam News

Leave a Comment