25.2 C
Hyderabad
September 20, 2026
హైదరాబాద్హోమ్

భూపతి చంద్ర స్మారక కథానికల పోటీ

#BhupatiChandra

సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపురము నకు చెందిన భూపతి చంద్ర మెమోరియల్ ట్రస్ట్ నిర్వహించిన భూపతి చంద్ర స్మారక కథానికల పోటీ – 2026 పురస్కారాల ప్రదానోత్సవ సభ ఈ నెల 19వ తేది గురువారం సాయంత్రం గం।। 5-00 ని।।లకు డా।। దేవులపల్లి రామానుజరావు కళామందిరం, తెలంగాణ సారస్వత పరిషత్తు, తిలక్‍ రోడ్‍, ఆబిడ్స్, హైదరాబాదు నందు నిర్వహిస్తున్నామని అధ్యక్షులు ఎమ్‍.ఎల్‍. కాంతారావు తెలియజేశారు.

బహుమతులకు ఎంపికైన రచయితలందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నామని, ఈ పోటీలో ప్రథమ బహుమతిగా రూ. 10,000/-, ద్వితీయ బహుమతిగా రూ. 8,000/-, తృతీయ బహుమతిగా రూ. 6,000/- నగదు బహుమతులతో పాటు ప్రోత్సాహక బహుమతులుగా అయిదుగురు రచయితలకు ఒక్కొక్కరికి రూ. 2,000/- చొప్పున నగదు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొ. సి.మృణాళిని కన్వీనర్‍, తెలుగు సలహామండలి, కేంద్ర సాహిత్య అకాడమీ,  విశిష్ట అతిథిగా కె. శ్రీనివాస్‍ పూర్వ సంపాదకులు, ఆంధ్రజ్యోతి దినపత్రిక, గౌరవ అతిథిగా మహమ్మద్‍ ఖదీర్‍బాబు ప్రముఖ రచయిత, సీనియర్‍ జర్నలిస్ట్, ఆత్మీయ అతిథిగా బి. నర్సింగ రావు, సినీ దర్శకులు, సాంస్కృతిక ప్రతినిధి పాల్గొంటారని, సభా నిర్వహణ సి.ఎస్‍.రాంబాబు నిర్వహిస్తారని అధ్యక్షులు ఎమ్‍.ఎల్‍. కాంతారావు అన్నారు.

(ఎమ్‍.ఎల్‍. కాంతారావు, అధ్యక్షులు, ‘‘భూపతి చంద్ర’’ స్మారక కథానికల పోటి – 2026, ఆనంద నిలయం, ఇం.నం. 1-5-1020/4, బి.ఆర్‍.రావు నగర్‍, ఓల్డ్ అల్వాల్‍, సికింద్రాబాద్‍-500010. RSVP: D. Lakshmana Swamy 99636 16999)

Related posts

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

Satyam News

9న సువేందు అధికారి ప్రమాణ స్వీకారం?

Satyam News

మార్చి లో గూగుల్ కు భూమి పూజ

Satyam News

అంగన్‌వాడీలకు వెంటనే వేతనాలు పెంచాలి

Satyam News

అఖండ 2 వెయ్యికోట్ల గ్రాస్: పెరిగిపోతున్న పందాలు

Satyam News

నర్సింగ్ ఆఫీసర్లకు ఇండక్షన్ శిక్షణ కార్యక్రమం

Satyam News

Leave a Comment