31.6 C
Hyderabad
September 21, 2026
తూర్పుగోదావరిహోమ్

మోడీ ప్రవర్తన తీరు దేశానికి అవమానకరం

#NarayanaCPI

అమెరికా విధానాలకు, ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు వల్ల దేశంలోని వ్యవసాయ, చేనేత రంగం నాశనం అయిపోతుందని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ట్రంప్ విధానాలకు సాగిలాపడి ప్రధాని మోడీ బానిసగా వ్యవహరిస్తున్నాడని పేర్కొన్నారు.

కాకినాడలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు సందర్భంగా ఆయన విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేసింది వాళ్లకు కోట్లాది రూపాయలను రుణాలు మాఫీ చేస్తుందన్నారు బ్యాంకులకు దారులలో 29 మంది ఉండగా వార్డుల 20 మంది గుజరాత్ రాష్ట్రానికి చెందిన వారిని సుమారుగా వారికి 27 లక్షల కోట్ల రూపాయల రుణాలను ఎగ్గొట్టారన్నారు.

వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆ రుణాలను మాఫీ చేస్తుందన్నారు. ప్రపంచానిని కుదిపి వేసిన ఎప్స్తీన్ ఫైల్స్లో మోడీ పేరు రావడంతోనే ఆయన అమెరికాకు సాగిల పడి దేశ పరువు తీసారన్నారు. కార్పొరేట్ల మేలు కోసం అటవీ చట్టాలను మార్పు చేసి అడవి సంపదను వారికి దోచి పెడుతున్నారన్నారు. ఆదివాసికి చెందిన రాష్ట్రపతితో అటవీ చట్టాన్ని మార్పు చేసి సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టి నక్సల్ పేరుతో గిరిజనులను  చంపేస్తున్నారన్నారు.

రాష్ట్రంలో అన్ని పార్టీలు బీజేపీతోనే ఉన్నాయని వీరి పోరాటం రాష్ట్రంలో కూటమి, వైసీపీలుగా ఉన్నా ఢిల్లీలో మాత్రం కలిసి ఉంటున్నారని చెప్పారు. బిల్ గేట్స్ ను తీసుకువచ్చి అమరావతిలో అరటి తోటలను చూపించిన సీఎం చంద్రబాబు కేంద్రంలో వ్యవసాయ రంగానికి మోసం చేస్తున్న మోడీని మాత్రం నిలువరించడంలో భయపడుతున్నట్లు చెప్పారు. వ్యవసాయ భూములను కారు చౌకగా కార్పోరేట్ కంపెనీలకు అప్పగిస్తున్నారని ఇలా కార్పోరేట్లకు ఊడిగం చేయడంలో మోడీ, బాబు పోటీ పడుతున్నారని నారాయణ ఎద్దేవా చేశారు.

ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆయా నాయకులకు బానిసలుగా ఉండొద్దని సూచించారు. నాయకులు మాట విని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి నేటికీ కూడా శిక్షను ఎదుర్కొంటున్నారని అందువల్ల ఆ అధికారులు స్వతంత్రంగా వ్యవహరించాలని నారాయణ కోరారు.

తిరుమల లడ్డు కల్తీ వ్యవహారాల్లో బాధ్యులైన వారిని శిక్షించి కోట్లాది రూపాయలు చేతులు మారిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలపై పోరాటం చేసి సీపీఐని బలోపేతం చేస్తామని నారాయణ చెప్పారు. దేశానికి చెందిన గాంధీ, నెహ్రూల పేరులను తొలగింప చేసి వారి స్థానంలో వాజ్పేయి విగ్రహాన్ని పలు చోట్ల ఏర్పాటు చేయడం పట్ల ఖండించారు.

బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాజ్పేయిలు దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొనలేదన్నారు. ఉపాధి హామీ పథకానికి పేరు మార్చి రాష్ట్రాలకు ఆ పథకాన్ని గుదిబండగా మార్చారని చెప్పారు. అసలే ఆర్థిక లోటుతో ఉన్న ఈ పథకం అమలు చేయడం రాష్ట్రానికి తీవ్ర నష్టమని చంద్రబాబు చెప్పే స్థాయిలో లేకపోవడం విచారకరమని నారాయణ అన్నారు. ఈ సమావేశంలో సీపీఐ జాతీయ సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు తాటిపాక మధు తదితరులు పాల్గొన్నారు.

Related posts

మొక్కజొన్న రైతుల ఇబ్బందులు తీర్చరా?

Satyam News

మాట నిలబెట్టుకున్న లోకేష్‌: పునర్వికకు రూ. 16 కోట్ల ఇంజెక్షన్‌

Satyam News

మహిళా పోలీసుల గౌరవాన్ని కించపరిచేలా బీఆర్‌ఎస్‌ నేతల తీరు

Satyam News

తండ్రి చనిపోయిన రోజు…. కోల్‌కతాలో సూట్‌కేసులతో జగన్‌..??

Satyam News

భార్య విగ్రహంతో పాటు తన విగ్రహాన్ని ఆవిష్కరించిన 89 ఏళ్ల రైతు

Satyam News

మీ సేవ కేంద్రాలతో అత్యుత్తమ డిజిటల్ సేవలు

Satyam News

Leave a Comment