26.3 C
Hyderabad
September 19, 2026
ఆధ్యాత్మికంహోమ్

122 ఏండ్ల తర్వాత తెరుచుకోనున్న ‘కోణార్క్‌’ గర్భ గుడి

ఒడిశాలోని 13వ శతాబ్దపు కోణార్క్‌ సూర్య దేవాలయ గర్భ గుడిలోకి త్వరలో భక్తులు ప్రవేశించే అవకాశం రానున్నది. ప్రస్తుతం ఆ స్థలం ఇసుకతో నిండి ఉంది. దాన్ని ఇప్పుడు తొలగిస్తున్నారు. ఆలయం వెనుక ఉన్న 15 అడుగుల ఎత్తయిన గోడ కూలిపోకుండా నిరోధించడానికి బ్రిటిష్‌ పాలకులు 1903-04లో గర్భ గుడిని వేల టన్నుల ఇసుకతో నింపారు.

జగ్‌మోహన్‌ హాల్‌గా పిలిచే ఈ ప్రాంతంలోకి శతాబ్దం పాటు ఎవరూ ప్రవేశించలేదు. తాజాగా భారత పురావస్తు శాఖ, ఐఐటీ మద్రాస్‌ నిపుణులతో కూడిన బృందం ఈ ఇసుకను తొలగించే పని చేపట్టింది. మొత్తం ఇసుకను తరలించడానికి మూడు నెలలు పడుతుందని ఓ పురావస్తు శాఖ అధికారి తెలిపారు. ఇసుకను తరలించిన తర్వాత లోపలి గోడల పటిష్ఠతను పరిశీలించి గుడి పునర్‌ నిర్మాణంపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు.

Related posts

క్వాంటం టెక్నాలజీకి అమరావతి లాంచ్ పాడ్

Satyam News

బెలూచిస్తాన్ తిరుగుబాటుదారులపై పాక్ ప్రతీకారం

Satyam News

రూ.40 లక్షల నిధులతో ఆత్కూరు డ్రైన్

Satyam News

నేటి నుంచి భారీగా పెరిగిన గ్యాస్ ధరలు

Satyam News

పశ్చిమ బెంగాల్ సీఎంగా సువేందు ప్రమాణం

Satyam News

వెదురుపాక విజయదుర్గా పీఠాధిపతి కన్నుమూత

Satyam News

Leave a Comment