26.7 C
Hyderabad
September 20, 2026
జాతీయంహోమ్

పశ్చిమ బెంగాల్ సీఎంగా సువేందు ప్రమాణం

#SuvenduAdhikari

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. కోల్‌కతాలోని బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన ఈ భారీ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ హాజరయ్యారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్ ఎన్ రవి ముఖ్యమంత్రిగా సువేందు అధికారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమ ప్రాంగణం మొత్తం ‘జై శ్రీరామ్’ నినాదాలతో మార్మోగింది. కాషాయ జెండాలు రెపరెపలాడగా, డప్పుల మోగింపులతో సభా ప్రాంగణం ఉత్సాహభరితంగా మారింది.

ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, ఎన్‌డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. దీంతో ఈ కార్యక్రమానికి జాతీయ స్థాయిలో ప్రాధాన్యత ఏర్పడింది.

భవానీపూర్, నందిగ్రామ్ నియోజకవర్గాల నుంచి విజయం సాధించిన సువేందు అధికారి ముందుగా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అనంతరం సీనియర్ బీజేపీ నేత, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ మంత్రిగా ప్రమాణం చేశారు.

తదుపరి బీజేపీ ఎమ్మెల్యేలు అగ్నిమిత్ర పౌల్, అశోక్ కిర్తానియా, క్షదీరామ్ తండూ, నితిష్ పరమానాయక్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం ఆరుగురు సభ్యులతో తొలి కేబినెట్ ఏర్పడింది. మంత్రులకు శాఖల కేటాయింపు ఇంకా ప్రకటించలేదు.

సామాజిక, ప్రాంతీయ సమతుల్యతను దృష్టిలో పెట్టుకుని బీజేపీ తొలి కేబినెట్‌ను రూపొందించినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయంగా తీవ్ర ధ్రువీకరణ ఉన్న పశ్చిమ బెంగాల్‌లో పాలన సాగించడం కొత్త ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారనుంది.

దీర్ఘకాలంగా తృణమూల్ కాంగ్రెస్ ఆధిపత్యంలో ఉన్న రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం దేశ రాజకీయాల్లో కీలక పరిణామంగా భావిస్తున్నారు.

Related posts

కువైట్‌లో ప్రవాస భారతీయులు అప్రమత్తంగా ఉండాలి

Satyam News

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు క్లీన్ చిట్

Satyam News

జనం మెచ్చిన వారికే టికెట్లు..!

Satyam News

ఢిల్లీ పేలుళ్లు: 8 మంది మృతి

Satyam News

హైదరాబాద్‌లో ఘనంగా “యువ భారత్ రన్ 2026”

Satyam News

కార్యకర్తలకు ద్రోహం చేసిన జీవన్ రెడ్డి

Satyam News

Leave a Comment