23.8 C
Hyderabad
September 23, 2026
విజయనగరంహోమ్

సీఎం చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌నపై రాష్ట్ర‌ హోంమంత్రి ఆదేశాలు

#Chipurupalli

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ఫించన్లు పంపిణీ కోసం ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెల 28వ తేదీన‌  చీపురుపల్లి మండలం రావివలసకు వ‌స్తున్నార‌ని ఈ మేర‌కు అందుకు కావలసిన ఏర్పాట్లు 26 సాయంత్రాని కల్లా పూర్తిచేయాలని విజ‌య‌న‌గ‌రం జిల్లా ఇంచార్జి మంత్రి వంగలపూడి అనిత జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.

చీపురుపల్లి మండల పరిషత్ కార్యాలయములో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి, ఇతర జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భం గా జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి సీఎం  పర్యటన ఏర్పాట్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా  జిల్లాఇంచార్జ్ మంత్రికి  విరించారు. ఈ సంద‌ర్బంగా హోం మంత్రి అనిత మాట్లాడుతూ ఫించన్లు పంపిణీ కోసం సీఎం చంద్ర‌బాబు రెండోసారి జిల్లాకు వస్తున్న సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యవేక్షణలో చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు  సహకారంతో పక్కాగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

ఎలాంఇ అవాంతరాలు లేకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని పోలీస్ శాఖాధికారులను ఆదేశించారు. ఎక్కడికక్కడ సి సి కెమరాలు ఏర్పాటు చేసి మొత్తం కార్యక్రమం పర్యవేక్షణ చేయాలని సూచించారు. రావివలసలో పారిశుధ్య పనులు వేగవంతం చేయాలని  విధుల్లో అలసత్వం వహించవద్దని ఎవరికి కేటాయించిన పనులను సంబంధిత అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్  ఎస్ సేధు మాధవన్, ఆర్డివోలు ప్రమీలా గాంధీ , కీర్తి, రామ్మోహన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Related posts

గోడు వెళ్లబోసుకున్న ఆడబిడ్డలను కాపాడే బాధ్యత మాది

Satyam News

రాయలసీమ రూపురేఖలు మారుస్తున్న కూటమి ప్రభుత్వం

Satyam News

ఎస్ బి ఐ లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం

Satyam News

విమానంలో అసభ్య ప్రవర్తన: ఆస్ట్రేలియాలో భారతీయుడి అరెస్టు

Satyam News

మేడారం జాతర పనుల పురోగతిపై ఆకస్మిక తనిఖీ

Satyam News

దుబాయ్ లో చిక్కుకుపోయిన వారు సురక్షితంగా….

Satyam News

Leave a Comment