26.3 C
Hyderabad
September 19, 2026
ప్రత్యేకంహోమ్

అమెరికా లో అరకు కాఫీ… న్యూయార్క్ లో ఆనంద్ మహేంద్ర స్టోర్

అరకు కాఫీ ఘుమఘుమలు.. ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. ఉత్తరాంధ్ర తోటల్లో పెరిగిన మధురమైన కాఫీని ఖండాంతరాల్లోని ప్రజలు ఆస్వాదిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అరకు కాఫీ బ్రాండ్‌ని వరల్డ్ వైడ్ మార్కెటింగ్‌ చేయడం కోసం పర్సనల్‌గా ఎంతో ఎఫర్ట్‌ పెట్టారు. 2016లోనే అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబు.. దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలకు అరకు కాఫీని విశ్వవ్యాప్తం చేసే బాధ్యతలు అప్పగించారు.

ఆనాడు బాబుగారి కృషి ఫలితంగా.. మహీంద్రా గ్రూపు ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా.. ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపక సభ్యుడు క్రిస్‌ గోపాలకృష్ణన్‌, డాక్టర్ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ ఛైర్మన్‌ సతీష్‌రెడ్డి, సోమా ఎంటర్‌ప్రైజ్‌ ఛైర్మన్‌ మాగంటి రాజేంద్రప్రసాద్‌ వంటి ప్రముఖులు అరకు ఒరిజినల్స్ పేరుతో ఒక బ్రాండ్‌ని క్రియేట్‌ చేశారు.

2017లోనే అరకు ఒరిజనల్స్ బ్రాండ్‌ నేమ్‌తో పారిస్‌లో రిటైల్‌ ఔట్‌లెట్‌ను ప్రారంభించారు. త్వరలో మన అరకు కాఫీ అమెరికాలో అడుగుపెట్టబోతోంది. న్యూయార్క్‌ మహానగరంలోనే అత్యంత ఖరీదైన మాన్‌హాట్టన్‌ ప్రాంతంలో ఈ వేసవిలోనే అరకు కెఫేని ఓపెన్‌ చేస్తున్నామని ఆనంద్‌ మహీంద్రా ఎక్స్‌ వేదికగా ప్రకటించారు.

సెల్ఫీకి న్యూయార్క్‌ గ్లామర్‌ టచ్‌ ఇవ్వాలంటే స్టార్‌బక్స్‌ కాఫీ కప్పు చేతిలో ఉండాలని.. ఎక్స్‌లో ఆనంద్‌ మహీంద్రాకు ఒక సూచన వచ్చింది. ఈ పోస్టుకి ఇచ్చిన రిప్లయ్‌లో.. ఇండియాకి చెందిన అరకు కాఫీ ప్రమోట్‌ చేసే నేను స్టార్‌బక్స్‌ కాఫీ కప్పుతో ఎందుకు పోజులు ఇస్తానని ఎదురు ప్రశ్నించారు. ప్రపంచంలోని అత్యుత్తమమైన కాఫీ రకాల్లో ఒకటైన అరకు కాఫీ కప్పుతో త్వరలోనే సెల్ఫీని ఎక్స్‌పెక్ట్‌ చేయొచ్చని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లో రైతుల అభివృద్దే లక్ష్యంగా పని చేస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. అరకు కాఫీ పండించే రైతులది ఏ కులం అని చూడలేదు.. ఆ కాఫీ గింజలను ప్రాసెస్‌ చేసే ప్రొఫెషనల్స్‌ది ఏ మతం అని అడగలేదు.. మన కాఫీని అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్‌ చేస్తున్న పారిశ్రామికవేత్తల సామాజిక వర్గం గురించి పట్టించుకోలేదు. రాష్ట్రంలో పండించే ఉత్పత్తులకు ఒక బ్రాండ్‌ క్రియేట్‌ చేసి.. ఇంటర్నేషనల్‌ రేంజ్‌లో మార్కెటింగ్‌ సదుపాయాలు కల్పించడం ద్వారా రైతులను రారాజులను చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు.

Related posts

భక్తి పారవశ్యంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరుని రథోత్సవం

Satyam News

ఇరాన్ పై బీ 2 స్టిల్త్ బాంబర్ల ప్రయోగం

Satyam News

వైభవంగా లక్ష్మీనరసింహ కళ్యాణం

Satyam News

త్రిమూర్తుల కలయిక వల్లే రాష్ట్రం అభివృద్ధి

Satyam News

రెగ్యులర్ షూటింగ్ లో భీమవరం టాకీస్ “మహానాగ”

Satyam News

‘స్త్రీ శక్తి’ తో మహిళలకు ఆర్థిక చేయూత

Satyam News

Leave a Comment