26.3 C
Hyderabad
September 19, 2026
ప్రత్యేకంహోమ్

త్రిష ఎంట్రీ తో విజయ్ ఫ్యామిలీ విచ్ఛిన్నం

తమిళ సినిమా నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ కుటుంబం లో వివాదం ముదిరిపోయింది. భర్తతో విడాకులు కావాలంటూ ఓ మారు, ఓ నటితో ఎఫైర్ ఉందంటూ మరోసారి చెప్పిన ఆయన భార్య సంగీత తాజాగా మరోసారి కోర్టును ఆశ్రయించింది.

తమ విడాకుల కేసు ముగిసే వరకు తన భర్త, సినీ నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్ కి చెందిన నీలాంకరై నివాసంలో నివసించేందుకు అనుమతి ఇవ్వాలంటూ విజయ్‌ సతీమణి సంగీత చెంగల్పట్టు కోర్టులో ఒక మధ్యంతర పిటిషన్‌ దాఖలు చేశారు.

విజయ్‌ నుంచి విడాకులు కోరడంతో నీలాంకరై నివాసంలో ఉండేందుకు అనుమతించడం లేదని, దీంతో తాను చెన్నైలో ఇల్లు లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు పేర్కొన్నారు. అందువల్ల విడాకుల కేసు విచారణ పూర్తయ్యేంతవరకు నీలాంకరైలో ఉన్న విజయ్‌ నివాసంలో ఉండేందుకు అనుమతి ఇచ్చేలా ఆదేశించాలని ఆమె కోరారు.

అలాగే కోట్లు సంపాదిస్తున్న విజయ్‌.. తనకు, తన పిల్లలకు న్యాయంగా దక్కాల్సిన వాటాను అందించాలని, నీలాంకరై నివాసంలో తనకు, విజయ్‌కు సమాన హక్కు ఉందని, దీంతో ఆ ఇంటిలో నివసించేందుకు అనుమతి కోరగా, న్యాయవాది ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఓ నటితో తన భర్త విజయ్‌ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారని, అందువల్ల తనకు విడాకులు కావాలంటూ సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెల్సిందే. ఈ విడాకుల అంశం తెర మీదకు వచ్చినప్పటి నుంచి వీరి ఫ్యామిలీ కాస్త చిన్నాభిన్నం అయింది.

ప్రస్తుతం విజయ్‌ భార్య సంగీత లండన్‌లో ఉండగా, కుమారుడు జాసన్ సంజయ్ స్థానిక అశోక్‌ నగర్‌లో అద్దె ఫ్లాట్‌లోను, కుమార్తె దివ్య సాషా పీజీ హాస్టల్‌లో ఉంటున్నారు. విజయ్‌కు నీలాంకరైతో పాటు పట్టిణంపాక్కంలో విలావంతమైన గృహాలు ఉన్నాయి.

ఈ విడాకులు కేసు తీర్పు వచ్చి పంపకాలు జరిగేంత వరకు ఎక్కడి వారు అక్కడే ఉండే సూచనలు కనిపిస్తున్నాయి.

Related posts

నరసరావుపేటలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు

Satyam News

క‌మ్యూనిస్ట్ ల కుట్ర‌లో భాగమే ఏయూ ఘ‌ట‌న‌

Satyam News

బస్సు సేవలకు అడ్డంకులు సృష్టిస్తే కఠిన చర్యలు

Satyam News

దోమల నివారణకు ప్రత్యేక మాన్సూన్ డ్రైవ్

Satyam News

జగన్‌ జీరో.. పట్టించుకోని రేవంత్‌, కేటీఆర్‌..!!

Satyam News

SIRతో దొంగ ఓట్ల గుట్టు రట్టు..వైసీపీలో మొదలైన వణుకు.!

Satyam News

Leave a Comment