26.3 C
Hyderabad
September 19, 2026
ప్రపంచంహోమ్

దుబాయ్ ని వదిలి వెళుతున్న ప్రవాసులు

పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధ మేఘాలు, ముదురుతున్న ఉద్రిక్తతలు దుబాయ్‌లో విషాదకరమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ఇరాన్ దాడుల భయంతో సురక్షిత ప్రాంతాలకు ప్రవాసులు వెళ్ళి పోతున్నారు. తమతో పాటు ఇన్నాళ్లు కలిసి ఉన్న పెంపుడు జంతువులను నడిరోడ్డుపై వదిలేస్తున్నారు.

యజమానులు తమ కుక్కలను స్తంభాలకు కట్టేసి అలాగే వెళ్ళిపోతున్నారు. ఆహారం, నీరు లేక అవి ఆక్రందనలు చేస్తున్నాయి. పిల్లులను అట్టపెట్టెల్లో పెట్టి, వాటిపై ‘‘మమ్మల్ని క్షమించండి.. వీటిని తీసుకెళ్లడం మా వల్ల కాదు’’ అని రాసి రోడ్ల పక్కన పడేస్తున్నారు.

కొంతమంది ప్రవాసులు పెంపుడు జంతువులను తరలించే ఖర్చు భరించలేక, వాటికి విషం ఇచ్చి చంపేయాలని పశువైద్యులను కోరుతుండటం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రాణం కంటే ప్రేమ చిన్నదైపోయిందన్నట్లుగా సాగుతున్న ఈ పరిణామాలు జంతు ప్రేమికులను కలచివేస్తున్నాయి.

రోడ్డు మార్గంలో ఒమన్ సరిహద్దులకు చేరుకుంటున్న వారు, అక్కడ జంతువులకు అనుమతి లేకపోవడంతో వాటిని ఎడారిలోనే వదిలి వెళుతున్నారు. భగభగమండే ఎండలో ఆహారం లేక అవి అలమటిస్తున్నాయి. అటు జంతు సంరక్షణ కేంద్రాలు కూడా ఇప్పటికే నిండిపోవడంతో కొత్తగా వచ్చే జంతువులను చేర్చుకోవడం వారికి భారంగా మారింది.

రోజుకు వందల సంఖ్యలో ఫోన్ కాల్స్ వస్తున్నాయని స్వచ్ఛంద సంస్థలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. దుబాయ్ మున్సిపాలిటీ వీధి జంతువుల కోసం ఏర్పాటు చేసిన ‘ఎహ్సాన్ స్టేషన్’ (ఆహారం అందించే స్మార్ట్ మెషీన్లు) ఇప్పుడు పెరుగుతున్న ఈ సంఖ్యకు సరిపోవడం లేదు. సంపన్న దేశంలో ఇలాంటి అమానవీయ ఘటనలు జరగడం పట్ల అంతర్జాతీయ స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

Related posts

వైసీపీ ‘అనుబంధ’ పోలీసు ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం

Satyam News

చేతిలో బైబిల్..చేతల్లో ద్రోహం…సొంత వర్గానికే జగన్ వెన్నుపోటు!

Satyam News

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన బీజేపీ

Satyam News

తిరుమలలో ఉచిత బస్సుల సంఖ్య పెంపు

Satyam News

జగన్ టూర్ పై గంటా మాస్ వార్నింగ్

Satyam News

క్వాంటం టెక్నాలజీకి అమరావతి లాంచ్ పాడ్

Satyam News

Leave a Comment