26.3 C
Hyderabad
September 19, 2026
ఆధ్యాత్మికంహోమ్

సరస్వతి దేవాలయంలో అష్టాదశ శక్తి పీఠాల విగ్రహాల ప్రతిష్ట

పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ఉప్పలపాడు గ్రామ సమీపంలో వెలసిన సరస్వతి దేవాలయంలో గురువారం అష్టాదశ శక్తి పీఠాల వాయు ప్రతిష్టా కార్యక్రమాలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆమె అర్చకులు ఆధ్వర్యంలో గణపతి పూజ, పుణ్యాహవాచనం, మండపారాధన, అభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వేద పండితుల ఆధ్వర్యంలో చండీయాగం, పూర్ణాహుతి చేపట్టారు. జ్ఞాన సరస్వతి దేవాలయంలో లక్ష్మీ గణపతి, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అభయాంజనేయ స్వామి, మహంకాళి, మహాకాళేశ్వరుడు, మహాలక్ష్మి,జ్ఞాన సరస్వతి దేవి, 11 అడుగుల విష్ణుమూర్తి ఉప ఆలయాలు ఉన్నట్లు ఆలయ చైర్మన్ అన్నపూర్ణయ సిద్ధాంతి తెలియజేశారు.

అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు డాక్టర్ కంజుల జగన్మోహన్ రెడ్డి, సెక్రటరీ గుంటూరు సీతారామాంజనేయులు, కోశాధికారి ఆదినారాయణ, హనుమంతరావు ఇతర కమిటీ సభ్యులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అష్టాదశ శక్తిపీఠాల వాయు ప్రతిష్ట మహోత్సవాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

నీట్ విద్యార్ధుల కోసం రైతులు రావాలి: కాక్రోచ్

Satyam News

శృంగారంపై సమంత వ్యాఖ్యలు వైరల్ !

Satyam News

ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై వైసీపీ గూండాల దాడి

Satyam News

త్రిమూర్తుల కలయిక వల్లే రాష్ట్రం అభివృద్ధి

Satyam News

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి

Satyam News

కాటన్ మిల్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో లక్ష పుష్పార్చన

Satyam News

Leave a Comment