తల్లి మీదే కేసు వేసి కోర్టుకి లాగిన జగన్ నుంచి ఇంతకంటే ఏమి ఆశించగలం?… కనీసం ఐప్యాక్ చైల్డ్ ఆర్టిస్ట్ కి ఇచ్చిన విలువ కూడా తన తల్లి విజయమ్మకి జగన్ ఇవ్వలేదు. భర్త చనిపోయిన రోజు, కొడుకు ఏదో ఓదారుస్తాడని దగ్గరకు వెళ్తే, జగన్ కనీసం ఆమె మొఖం వైపు కూడా చూడలేదు..
ఐప్యాక్ పెట్టిన చైల్డ్ ఆర్టిస్ట్ కి ముద్దు పెట్టగానే, సెక్యూరిటీ వాడు లాగి అవతల పడేసాడు.. అలాగే తనకు కూడా అదే రకమైన ఆప్యాయత చూపిస్తాడని విజయమ్మ ఆశగా కొడుకు వైపు వెళ్ళింది.. కొడుకు గుండెల పై బాధ చెప్పుకుందాం అనుకుంది.. అక్కడ ఉంది జగన్ కదా, కనీసం ఆమె మొఖం వైపు కూడా చూడలేదు..
బిక్క మొఖంతో విజయలక్ష్మి పక్కకి వెళ్ళిపోయింది.. విజయమ్మ మొఖం చూసి సెక్యూరిటీ వాళ్ళు కూడా షాక్ తిన్నారు.. వాళ్ళ మొఖం చూడండి.. ఎవరో బంధువు వచ్చి విజయమ్మ బాధ అర్ధం చేసుకుని ఓదార్చింది.. నువ్వు చేసేది తప్పు అని జగన్ కి చెప్పింది.. అయినా జగన్ ఎందుకు వింటాడు? ఆమె మీద నాలుగు అరిచి పోయాడు..
అక్కడ నుంచి వెళ్ళేప్పుడు కూడా విజయమ్మ ఆశగా కొడుకు జగన్ వైపు చూసింది.. వెళ్తున్నా అని చెప్తాడేమో అని… ఎబ్బే చివరకు అది కూడా లేదు…ఈ విషయంపై పులివెందుల ప్రజలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇటీవల తల్లిపై కేసు గెలిచిన జగన్ ఇంకా ఆ కక్షతోనే ఉన్నాడని వ్యాఖ్యానిస్తున్నారు.