26.3 C
Hyderabad
September 19, 2026
హైదరాబాద్హోమ్

పెన్షన్ బెనిఫిట్స్ కోసం లంచం: ఇద్దరి పట్టివేత

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, పే-బిల్ సెక్షన్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కె. రమేష్ (48), ఫిర్యాదుదారుడి నుండి రూ. 13,000 లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు, అతడిని పట్టుకున్నారు. తనతో పాటు అదే సెక్షన్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న అరవింద్ తరపున కూడా ఈ మొత్తాన్ని వసూలు చేసిన రమేష్, ఫిర్యాదుదారుని తల్లికి సంబంధించిన పెన్షన్ బెనిఫిట్ ఫైల్‌ను ఇప్పటికే ప్రాసెస్ చేసి ఉన్నతాధికారులకు పంపినందుకు ప్రతిఫలంగా మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఫైల్‌ను తదుపరి చర్యల కోసం ముందుకు పంపేందుకు (అధికారిక మేలు చేసేందుకు) గాను ఈ లంచాన్ని అక్రమ ప్రయోజనం కింద స్వీకరించాడు.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతినిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి”. అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన “వాట్సాప్ (9440446106), ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును.

Related posts

ముంబైలో సామూహిక హత్యలకు భారీ కుట్ర?

Satyam News

కోట్లు ఖర్చు పెడుతున్నారు కానీ మాకు రోడ్లు లేవు

Satyam News

ఇల్లు కాపాడితేనే పండుగ సంతోషం

Satyam News

ప్ర‌ముఖ న్యాయ‌వాది కోల‌గ‌ట్ల త‌మ్మ‌న్నశెట్టి ఆత్మహత్య

Satyam News

జెఫ్రీ ఎప్ స్టిన్ మాజీ ప్రేయసికి రూ.850 కోట్లకు పైగా ఆస్తి?

Satyam News

పర్యావరణ పరిరక్షణకు అవగాహనే తొలి అడుగు

Satyam News

Leave a Comment