26.3 C
Hyderabad
September 19, 2026
విజయనగరంహోమ్

జై అమరావతి అంటూ విజయనగరంలో భారీ ర్యాలీ

#Vijayanagaram

లోక్ సభలో అమరావతి ని శాశ్వత రాజధాని గా చేస్తూ కేంద్రం బిల్లు పాస్ అవడంతో విజయనగరంలో విజయోత్సవ ర్యాలీ గురువారం జరిగింది. కూటమి ఎమ్మెల్యే ఆదితీ నేతృత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు ఆకుపచ్చ రంగులు జెండాలు మెడలో వేసుకుని త్రివర్ణ పతాకాన్ని చేత్తో పట్టుకుని నగరంలోని అశోక్ బంగ్లా నుంచే ఆంబేద్కర్ జంక్షన్ వరకు ర్యాలీ కొనసాగించారు.

విద్యుత్ దీప కాంతుల్లో విజయనగరం కలెక్టరేట్

రాష్ట్ర రాజధానిగా అమరావతిని శాశ్వతం చేస్తూ పార్లమెంట్ చారిత్రాత్మక బిల్లు ఆమోదం పొందడంతో జిల్లా కలెక్టరేట్ విద్యుత్ దీపాలతో అలంకరణ చేశారు. అమరావతి ని ఏపీ రాష్ట్ర రాజధానిగ కేంద్రం ఆమోదించిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. పలు  ప్రాంతాలలో ప్రజలు కేకులు కట్ చేయడం రంగోలి ముగ్గులు ర్యాలీలు కార్యాలయాలకు లైటింగ్ తదితర కార్యక్రమాలతో వారి సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు.  అందులో భాగంగా కలెక్టర్ ఆఫీస్ ను రంగురంగుల లైట్లతో అలంకరించారు.

Related posts

హోర్మోజ్ జలసంధి నుంచి 90 శాతం ట్యాంకర్ల బంద్

Satyam News

తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని రాజకీయాలు చేసిన వ్యక్తి జగన్

Satyam News

ఆగస్టు 7న ఓబిసి జాతీయ మహాసభకు రండి

Satyam News

దక్షిణ మధ్య రైల్వేకు జాతీయ సిగ్నల్ & టెలికమ్యూనికేషన్ అవార్డు

Satyam News

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన కూన శ్రీనివాస్ గౌడ్

Satyam News

ఇద్దరు అగ్ర మావోయిస్టుల లొంగుబాటు

Satyam News

Leave a Comment