26.3 C
Hyderabad
September 19, 2026
విశాఖపట్నంహోమ్

మర్డర్ కు దారితీసిన క్రికెట్ మ్యాచ్

#crime

విశాఖపట్నం నగరంలో ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో కేవలం ఒక క్రికెట్ మ్యాచ్ విషయంలో మొదలైన చిన్న గొడవ కాస్తా చివరకు ఒక యువకుడి హత్యకు దారితీసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరిలోవలోని పెద్ద గదిలి ప్రాంతానికి చెందిన డోలా అజిత్ (22) అనే యువకుడు తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతుండగా, ప్రత్యర్థి జట్టులోని కంట కిషోర్ అనే వ్యక్తికి మధ్య వివాదం చెలరేగింది. ఆట సమయంలో ఇరువర్గాల మధ్య మాట మాట పెరిగి ఘర్షణకు దారితీసింది. మ్యాచ్ ముగిసిన అనంతరం కూడా ఈ గొడవ సద్దుమణగలేదు. పెద్ద గదిలి జంక్షన్ వద్ద అందరూ చూస్తుండగానే కిషోర్ తన అనుచరులతో కలిసి అజిత్ పై దాడికి తెగబడ్డాడు.

ఈ దాడిలో అజిత్ తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతడిని గమనించిన స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ఆరిలోవలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే, అజిత్ పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

సమాచారం అందుకున్న ద్వారక ఏసీపీ నరసింహమూర్తి, ఆరిలోవ సీఐ మల్లేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడు కంట కిషోర్‌ను పోలీసులు వెనువెంటనే అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కేవలం ఆటలో తలెత్తిన వివాదం ప్రాణం తీసే వరకు వెళ్లడంపై మృతుని కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Related posts

హైదరాబాద్‌లో భక్తి వైభవంగా శ్రీ వేంకటేశ్వరస్వామి వారి రథోత్సవం

Satyam News

అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణం

Satyam News

శాస్త్రోక్తంగా శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి తిరుమంజనం

Satyam News

కుప్పలు తెప్పలుగా తరలివస్తున్న నిరుద్యోగులు

Satyam News

సుభాష్ నేరాన్ని సమర్థించే వారు ఇది తెలుసుకోవాలి….

Satyam News

వియత్నాం పడవ ప్రమాదంపై లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి

Satyam News

Leave a Comment