26.3 C
Hyderabad
September 19, 2026
రంగారెడ్డిహోమ్

రేవంత్ పాలన రాక్షస పాలన: హరీష్ రావు

#HarishRaoShamshababd

తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు మరింత వేడెక్కుతున్నాయి. శంషాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టీ.హరీష్ రావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

రేవంత్ పాలన అంటేనే “రాక్షస పాలన” అంటూ హరీశ్ రావు విమర్శించారు. ఇది గడీల పాలన, బేడీల పాలనగా మారిందని, అన్ని వర్గాల ప్రజలను నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. రైతుల భూములను స్వాధీనం చేసుకునేందుకు జారీ చేసిన నోటిఫికేషన్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, ఆ వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అయిందని ఆయన అన్నారు. గతంలో ప్రజాస్వామ్యాన్ని ఏడో గ్యారెంటీగా ప్రకటించిన ప్రభుత్వం, ఇప్పుడు ప్రతిపక్షాలపై ఎదురుదాడులు చేస్తోందని విమర్శించారు. ప్రజా సమస్యలపై మాట్లాడితే అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తున్నారని, రైతులను కలవకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకోవడం, అరెస్టులు చేయడం దౌర్జన్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు. రెండు మూడు పంటలు పండే సారవంతమైన భూముల్లో పరిశ్రమలు పెట్టాలని ప్రభుత్వం ప్రయత్నించడం దారుణమని విమర్శించారు.

భూసేకరణ నోటిఫికేషన్‌ను వెంటనే రద్దు చేయాలని, రైతుల పక్షాన తమ పోరాటం కొనసాగుతుందని హరీశ్ రావు స్పష్టం చేశారు. రైతులకు ధైర్యం చెప్పడానికి వెళ్తున్న తమ గొంతును ప్రభుత్వం నొక్కేస్తోందని అన్నారు.

రేవంత్ రెడ్డి ఇచ్చిన గ్యారెంటీలు బోగస్ అని, వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. పేదల ఇళ్లను కూల్చివేస్తూ ప్రభుత్వం వికృతానందం పొందుతోందని తీవ్ర విమర్శలు చేశారు.

రేవంత్ రెడ్డి తనను తాను రాముడిగా చెప్పుకుంటున్నారని, కానీ ఆయనను మించిన రావణాసురుడు ఎవరూ ఉండరని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేయడంలో ప్రభుత్వం విజయవంతమైందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సింగిల్ డిజిట్ సీట్లే వస్తాయని జోస్యం చెప్పారు.

ఎన్నికలు ఎప్పుడైనా జరిగినా కాంగ్రెస్ గెలవదని, ప్రతిపక్ష హోదా కూడా రాదని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి రాజకీయంగా అయిపోయిన కథ అని, తిరిగి గెలవడం ఆయనకు సాధ్యం కాదని అన్నారు. భవిష్యత్తులో “రామ రాజ్యం, కేసీఆర్ రాజ్యం” వస్తుందని హరీశ్ రావు పేర్కొన్నారు.

Related posts

జిందగీ నా మిలేగీ దుబారా 2 త్వరలో…..

Satyam News

ఈ చిత్రంలో కూడా జాన్వీ అందాల ఆరబోతేనా?

Satyam News

మధ్యాహ్న భోజనంలో అవినీతి మరకలు

Satyam News

చిలకలూరిపేట లో పల్స్ పోలియో

Satyam News

ఢిల్లీలో భారీగా ఆయుధాలు స్వాధీనం

Satyam News

భారతి సిమెంట్స్‌ మోసం…. న్యాయం కోసం బాధితుల పోరు

Satyam News

Leave a Comment