శ్రీకాకుళంహోమ్

మధ్యాహ్న భోజనంలో అవినీతి మరకలు

#Middaymeal

పాఠశాలకు విద్యార్ధుల హాజరు పెంచేలా ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకం పక్కదోవ పడుతున్నది. వంట ఏజెన్సీలు విద్యార్థుల హాజరు కంటే ఆన్లైన్ ద్వారా అధికంగా హాజరు చూపించి ఆ మొత్తాలను నొక్కేస్తున్నారు. ఉదాహరణకు ఆముదాలవలస ప్రాంతంలోని ఒక పాఠశాలలో తీసుకుంటే ఏడు లక్షల 50 వేల రూపాయలు ఈ విధంగా ఎక్కువ డ్రా చేసినట్లు తెలిసింది.

ఈ విషయం తెలిసినా విద్యాశాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఆముదాలవలస ప్రాంతంలో మధ్యాహ్న భోజనం అందించేందుకు అక్షయపాత్రతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఆముదాలవలస ప్రాంతంలోని 99 ప్రభుత్వ పాఠశాలలో 4896 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో కనీసం మూడు శాతం హాజరు కాకపోయినప్పటికీ ప్రతిరోజు పూర్తిస్థాయిలో హాజరు అయినట్లు రిపోర్టులు పంపిస్తున్నారు.

దానికి తగ్గట్టుగా చిక్కిలు, గుడ్లు, రాగి సంకటి, పలహారం చేసినట్లు వారికి పెట్టినట్లు లెక్కల్లో చూపిస్తూ డబ్బులు కొట్టేస్తున్నారు. ప్రభుత్వం ప్రతి ఒక్క విద్యార్థికి ఒకటి నుండి 5వ తరగతి వరకు ఆరు రూపాయల 15 పైసలు, ఆరు నుండి పదవ తరగతి వరకు ఏడు రూపాయల 19 పైసలు ఇస్తుంది. తినేందుకు విద్యార్ధులు రాకపోవడంతో పెద్ద మొత్తంలో ఏజెన్సీకి మధ్యలోని సిబ్బందికి లక్షల రూపాయలు మిగులుతున్నాయి.

సరుబుజ్జిలి మండలంలో 42 పాఠశాలలు ఉన్నాయి. వాటిలో నక్కల పేట, లద్దల కాగితాపల్లి పాఠశాలలను మూసివేశారు. మొత్తం ఒకటి నుండి 5వ తరగతి వరకు 486 మంది పిల్లలు, 6 నుండి 10వ తరగతి వరకు 1709 మంది విద్యార్థులు ఉన్నారు.

అదే విధంగా కొత్తకోట జిల్లా పరిషత్ హై స్కూలు స్కాం వెలుగులోకి వచ్చింది. 3 నుంచి 5వ తరగతి వరకు ఐదుగురు విద్యార్థులు ఉన్నారు. అలాగే 6 నుంచి పదవ తర గతి వరకు 223 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో ఎలిమెంటరీ స్కూల్ పరిధిలో ఉన్న వారు హాజరు మాత్రమే ఉంటున్నది. వారు స్థానికంగా ఉన్న ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చదువుతున్నారు.

అయినప్పటికీ ఏ రోజు 98% తక్కువ హాజరు ఆన్లైన్లో చూపించలేదు. వాస్తవంగా మాత్రం 88 శాతం మించి హాజరీ లేదు. 10 శాతం హాజరు అదనంగా చూపిస్తూ 7.50 లక్షలు నొక్కేశారు. ఈ స్కామ్ లో ప్రధాన సూత్రధారి ఎం ఆర్ సి లో ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ గా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

కొత్తకోట పాఠశాలలో వంట ఏజెన్సీ గా పనిచేసిన నలుగురిలో ఒక వ్యక్తి కంప్యూటర్ ఆపరేటర్ సతీమణి, మరొకరు తనకు స్వయానా వదిన చేతిలో ఆన్లైన్ ఉండటంతో గుట్టు చప్పుడు కాకుండా 2019 నుంచి ఈ తతంగం నడుపుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. సరుబుజ్జిలి మండలం జడ్పీ హెచ్ఎస్ కొత్తకోట పాఠశాల జరిగిన స్కాంపై విద్య శాఖ ఉన్నతాధి కారులు, సర్వ శిక్ష అభియాన్ అధికారులు పరిశీలించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

ఈ స్కాము కు కారకులైన వారిని కాపాడేందుకు రాజకీయ పలుకుబడి ఉపయోగించి విద్యాశాఖ అధికారులు తీవ్రస్థాయి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. స్కాంకు కారకుడైన కంప్యూటర్ ఆపరేటర్ ను తప్పించేందుకు సర్వ శిక్ష అభియాన్ వారు ఇవ్వవలసిన సెలవును కూడా ఎంఈఓ మంజూరు చేసి సెలవుపై పంపించారు. సరుబుజ్జిలి మండలంలోని కొత్తకోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన అవినీతిపై వచ్చిన వార్త కథనాన్ని పాలకుల దృష్టి కి రాకుండా మండల విద్యాశాఖ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

Related posts

ఆందోళనకర పరిస్థితి లోకి మళ్ళీ న్యూఢిల్లీ

Satyam News

చంద్రబాబు.. ది అన్‌స్టాపబుల్‌.. . దేశంలోనే టాప్‌ పారిశ్రామికవేత్త సంచలనం..!!

Satyam News

సింగూరు ప్రాంతాన్ని ఆక్రమిస్తున్న మంత్రి బామ్మర్ది

Satyam News

ప్రభుత్వ డాక్టర్లపై దాడులకు పాల్పడినవారిపై చట్టపరమైన చర్యలు

Satyam News

వైద్య హబ్‌గా తెలంగాణ : స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

Satyam News

కేంద్ర కేబినెట్ విస్తరణ కు ముహూర్తం ఖరారు

Satyam News

Leave a Comment