26.3 C
Hyderabad
September 19, 2026
ప్రపంచంహోమ్

ఇస్తాంబుల్ లో ఇజ్రాయెల్ కాన్సులేట్ పై దాడి

#Istamble

టర్కీ రాజధాని ఇస్తాంబుల్ లోని ఇజ్రాయెల్ కాన్సులేట్ భవనంపై దాడి జరిగింది. మంగళవారం ముగ్గురు దుండగులు అక్కడి పోలీసులపై కాల్పులు జరపడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ కాల్పుల ఘటనలో పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక దుండగుడు మృతి చెందగా, మిగిలిన ఇద్దరిని గాయాలతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనలో ఇద్దరు పోలీసు సిబ్బంది స్వల్ప గాయాలు పొందినట్లు ఇస్తాంబుల్ గవర్నర్ దావో గుల్ తెలిపారు. దుండగులు దీర్ఘ నాళాల ఆయుధాలతో (లాంగ్ బ్యారెల్ గన్స్) వచ్చి దాడికి పాల్పడ్డారని అధికారులు వెల్లడించారు.

టర్కీ అంతర్గత వ్యవహారాల మంత్రి ముస్తఫా సిఫ్టీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ దాడికి పాల్పడిన వారు సమీప నగరమైన ఇజ్ మిట్ నుంచి అద్దె వాహనంలో ఇస్తాంబుల్‌కు చేరుకున్నట్లు తెలిసింది. వారిలో ఒకరు మత ఛాందస వాదానికి మద్దతు ఇచ్చే గుంపుతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నామని తెలిపారు. అయితే ఆ సంస్థ పేరును వెల్లడించలేదు.

గతంలో టర్కీలో తీవ్రవాద దాడులకు ఇస్లామిక్ స్టేట్ పాల్పడిన విషయం తెలిసిందే. దుండగుల్లో ఇద్దరు సోదరులు కాగా, వారిలో ఒకరికి మాదక ద్రవ్యాలకు సంబంధించిన క్రిమినల్ కేసులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కాన్సులేట్ ఒక ఎత్తైన భవనంలో ఉన్నప్పటికీ, ప్రస్తుతం టర్కీలోని ఇజ్రాయెల్ మిషన్లలో ఎలాంటి ఇజ్రాయెల్ దౌత్యవేత్తలు లేరని అధికారులు స్పష్టం చేశారు.

గాజా యుద్ధం తర్వాత టర్కీ-ఇజ్రాయెల్ సంబంధాలు ఉద్రిక్తంగా మారడంతో భద్రతా కారణాల వల్ల ఇజ్రాయెల్ తమ దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించుకుంది. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభించినట్లు న్యాయశాఖ మంత్రి అకిన్ గుర్లిక్ ప్రకటించారు. నగరంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు అధికారులు తెలిపారు.

Related posts

New Record: దేవాదాయ శాఖలో 191 మందికి నియామక ఉత్తర్వులు

Satyam News

రేవంత్ రెడ్డిని పొగిడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Satyam News

ఎన్నికల కోడ్ ముగిసే వరకు విజయోత్సవాలు నిషేధం

Satyam News

ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పిస్తున్న ప్రభుత్వం

Satyam News

ఏపీ ప్రభుత్వంపై కేటీఆర్ ప్రశంసల జల్లు

Satyam News

ప్రభుత్వ బడుల్లో విద్య మరింత బలోపేతం

Satyam News

Leave a Comment