విశాఖపట్నంహోమ్

నిరాశ్రయ గృహం లో ఉచిత వైద్య శిబిరం

#ShankhabrtaBagshiIIPS

విశాఖపట్నంలో 11 ఏళ్ల క్రితమే లక్ష్మీగాయత్రి పేరిట ట్రస్టు, ఆస్పత్రి ప్రారంభించి, ఇప్పటి వరకు 600వరకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించిన డాక్టర్ కాండ్రేగుల వెంకట రామ్‌కుమార్ సేవలు అభినందనీయమని పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబత్రబగ్చీ కొనియాడారు.

లక్ష్మీ గాయత్రి ఆసుపత్రి ఆధ్వర్యంలో మంగళవారం ఆర్టీసీ కాంప్లెక్సు సమీపంలో ఉన్న నిరాశ్రయ గృహం లో ఉచిత వైద్య సేవల్ని సీపీ బగ్చీ ప్రారంభించి మాట్లాడారు. ప్రతి నెలా పేదల కోసం శిబిరాల్ని ఏర్పాటు చేసి, ఉచితంగా వైద్యం, మందులు అందజేస్తున్న రామ్‌కుమార్‌ను సీపీ అభినందించారు.

ఈ సారి ప్రత్యేకంగా నిరాశ్రయుల కోసం డాక్టర్ రామ్‌కుమార్ 20బియ్యం బస్తాల్ని కూడా అందజేశారన్నారు. ప్రతి నెల కూడా 20 బియ్యం బస్తాలని ఇస్తామని కె.వి.రాంకుమార్ అన్నారు.‘ఆపరేషన్ జ్యోతిర్గమయ’లో భాగంగా పోలీసుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టి మందుల్ని అందుబాట్లో ఉంచడంపై పేదలు కతజ్ఞతలు తెలియజేశారు.

పేదలు, వద్ధులు ఏ అవసరం వచ్చినా తనను సంప్రదించొచ్చని, మందులు నిత్యం అందుబాట్లో ఉంటాయని ఈ సందర్భంగా రామ్‌కుమార్ తెలిపారు. వద్ధులకు అల్పాహారం పెట్టించారు. కార్యక్రమంలో లక్ష్మీగాయత్రి ఆస్పత్రి  డాక్టర్స్ రమేష్, ఆనంద్, జనసేన పార్టీ డాక్టర్స్ సెల్ ప్రతినిధి వాకా సునీత, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

కాకినాడ పరిసరాల్లో తీరం తాకే అవకాశం

Satyam News

ఖమ్మం ఉమ్మడి జిల్లాకు గోదావరి జలాలే లక్ష్యం

Satyam News

నాగపూర్ లో పేలుడు: 15 మంది మృతి

Satyam News

ప్రత్యర్థుల గుండెల మీదకు ఇక ప్రళయ్ క్షిపణి

Satyam News

కర్నూలు వ్యవసాయ మార్కెట్ నూతన పాలక మండలి

Satyam News

కలుపు నివారణ మందు పారాక్వాట్ పై నిషేధం

Satyam News

Leave a Comment