ముఖ్యంశాలుహోమ్

మొక్కజొన్న రైతుల ఇబ్బందులు తీర్చరా?

#DKAruna

జోగులాంబ గద్వాల జిల్లాలో మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు ఎంపీ డి కె అరుణ నేడు ఆకస్మికంగా గద్వాల మార్కెట్ యార్డ్‌ను సందర్శించారు. మార్కెట్‌కు భారీగా మొక్కజొన్న తీసుకొచ్చిన రైతులు కొనుగోళ్లు జరగక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని ఆమె ప్రత్యక్షంగా పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న అనంతరం సంబంధిత అధికారులతో కూడా చర్చించి వెంటనే ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన డి కె అరుణ రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు. ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొన్నదని విమర్శించారు. రైతుల గురించి ప్రభుత్వం అసలు ఆలోచిస్తున్నదా అనే ప్రశ్నను లేవనెత్తుతూ, సీఎం సొంత జిల్లాలోనే ఇటువంటి పరిస్థితి ఉంటే ప్రభుత్వ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో అర్థం కావడం లేదన్నారు. వెంటనే మార్కెట్ యార్డుల్లో ఉన్న మొక్కజొన్నను పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు.

జిల్లాలో సుమారు 2 లక్షల 70 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట పండిందని, MSP రూ.2400 ఉన్నప్పటికీ రైతులు రోజుల తరబడి వేచి ఉండలేక బయట తక్కువ ధరకు అమ్ముకుని క్వింటాల్‌కు రూ.700 నుంచి రూ.800 వరకు నష్టపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డులకు పెద్ద ఎత్తున పంట తీసుకొచ్చినా కొనుగోళ్లు జరగకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు.

ఎకరాకు 25 క్వింటాళ్ల మేర మాత్రమే కొనుగోలు చేసి మిగిలిన పంటను రైతులే తీసుకెళ్లాలని అధికారులు చెబుతున్నారని రైతులు వాపోయారు. మార్కెట్ యార్డుకు వచ్చిన పంటను వెంటనే కొనుగోలు చేసి గోదాములకు తరలించకపోవడంతో రైతులు పది నుంచి పదిహేను రోజుల పాటు అక్కడే ఉండి కాపలా కాయాల్సి వస్తోందని తెలిపారు. సంచులు సరఫరా చేయకపోవడంతో బయట అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోందని, అయినా వాటికి సగం ధర మాత్రమే చెల్లిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

సంచులు, హమాలీలు, రవాణా లారీలు లేవని అధికారులు చెబుతున్నారని, ఈ కారణంగా కొనుగోళ్లు మరింత ఆలస్యం అవుతున్నాయని D. K. Aruna అన్నారు. మార్కెట్ యార్డులో త్రాగునీటి వంటి కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం దారుణమని విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధర అందేలా చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.

మరిన్ని కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని, ముఖ్యంగా మల్దకల్, గట్టు ప్రాంతాల్లో వెంటనే కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు. రైతులు నష్టపోకుండా కొనుగోళ్లలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని, మార్క్ఫెడ్ జీఎంతో ఫోన్‌లో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, సకాలంలో చెల్లింపులు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు బండల వెంకట రాములు, జిల్లా కోశాధికారి మిర్జాపురం రామచంద్ర రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.కె.రెడ్డి, బీజేపీ నాయకులు కృష్ణం రాజు, అమరవాయి మురళీధర్ రెడ్డి, రజక నరసింహ, రఘు గౌడ్, బెల్లం నరసింహ, మల్దకల్ మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

21 నెలల్లోనే 5.50 లక్షల ఇళ్లు..ఇది కూటమి రికార్డ్!

Satyam News

ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యేలా పాలన

Satyam News

యువ అడ్వకేట్ ను జైల్లో వేయించిన ఏపి హైకోర్టు న్యాయమూర్తి

Satyam News

మాల్యవంతం వారి ఇంట అలరించిన బొమ్మలకొలువు

Satyam News

కొత్త కోడలిపై కిరాతకం: దుర్గమ్మతో ఆటలు…

Satyam News

24న వినియోగదారుల హక్కుల దినోత్సవం

Satyam News

Leave a Comment