26.3 C
Hyderabad
September 19, 2026
గుంటూరుహోమ్

మరో మూడు రోజులు ఒక వైపు ఎండ మరొక వైపు వాన

#Rain

రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు మరో మూడు రోజులు కొనసాగే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఎండతీవ్రత, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు ప్రభావం చూపుతాయని వెల్లడించారు.

విదర్భ నుండి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమోరియన్ ప్రాంతం వరకు ద్రోణి కొనసాగుతుందని ఎపిఎస్డీఎంఎ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో మంగళవారం (05-05-26) మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పని చేసే రైతులు, కూలీలు, పశు కాపరులు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు.

మరోవైపు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ఎండ తీవ్రత, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

సోమవారం కృష్ణా(జి) పెద్దపారుపూడిలో 43.9°C, ఎన్టీఆర్(జి) విజయవాడ తూర్పులో 43.1°C, నంద్యాల(జి) దొర్నిపాడులో 42.9°C, మార్కాపురం(జి) పెద్దదోర్నాల, నెల్లూరు జిల్లా గూడూరు, శ్రీకాకుళం (జి)  తామాడలో 42.7°C, వైఎస్సార్ కడప(జి) జమ్మలమడుగులో 42.6°C, ఏలూరు(జి) ధర్మాజీగూడెంలో 42.2°C, కర్నూలు(జి) మంత్రాలయంలో 42°C, అనంతపురం(జి) తెరన్నపల్లిలో 41.9°C, పల్నాడు(జి) అమరావతిలో 41.8°C, చిత్తూరు(జి) తవణంపల్లెలో 41.6°C, గుంటూరులో 41.3°C, ప్రకాశం(జి) మర్రిపూడిలో 41.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొన్నారు. 28 జిల్లాలకు గాను 16 జిల్లాల పరిధిలోని 74 మండలాల్లో ఎండ తీవ్ర ప్రభావం చూపి 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.

Related posts

300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు..

Satyam News

కాల్పులు చూసి నేను భయపడలేదు: ట్రంప్

Satyam News

కళా భూమి యుగాది పురస్కారానికి పీసీ ఆదిత్య ఎంపిక…

Satyam News

సైఫన్ గేట్లు తెరుచుకున్న సరళాసాగర్

Satyam News

కాంగ్రెస్ సర్కార్  మరో భారీ భూ కుంభకోణం

Satyam News

వైసీపీ ఫేస్ బుక్ పేజీ ని బ్లాక్ చేసిన మెటా

Satyam News

Leave a Comment