శ్రీ వేoకటేశ్వర స్వామి కృపతో టి .టి .డి . తిరుపతి లో నిర్వహిస్తున్న శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాలలలో 2027-2026 విద్యా సంవత్సరమునకు ప్రవేశముల ప్రక్రియ ప్రారంభమైనది. అర్హత గల విద్యార్థులు https://admission.tirumala.org ద్వారా తమ దరఖాస్తులను ఆన్ లైన్ లో తేదీ 06.05.2026 నుండి 0 3.06 .2026 వరకు సమర్పించవచ్చును.
దరఖాస్తులను ఆన్ లైన్ లో మాత్రమే సమర్పించాలి. ప్రతులను కళాశాలలో సమర్పించవలసిన పనిలేదు. ఆన్ లైన్ లో దరఖాస్తు ఆంగ్ల భాషలో మాత్రమే వున్నది. విద్యార్ధుల సౌకర్యార్థము స్టూడెంట్ యూజర్ మాన్యువల్ ను, కళాశాలల ప్రాస్పెక్టస్ లను తెలుగు, ఆంగ్ల భాషలలొ ఇవ్వడం జరిగింది.
విద్యార్థులు https://admission.tirumala.org వెబ్ సైట్ ను ఓపెన్ చేసిన వెంటనే కనిపించే స్క్రీను పైన గల “Student Manual in English” or “Student Manual in Telugu” అనే బాక్సులలో తమకు కావలసిన బాక్సు పైన క్లిక్ చేసి ధరఖాస్తు చేయు పద్దతిని తెలుగులో కానీ ఆంగ్లములో కానీ చదివి అర్థము చేసుకోవాలి.
తరువాత “junior college” పైన క్లిక్ చేసి తరువాత కనిపించే స్క్రీను పైన English లేదా Telugu అనే బాక్సు లలో తమకు కావలసిన బాక్స్ పైన క్లిక్ చేస్తే రెండు కళాశాలలలోని వివిధ గ్రూపులలో గల సీట్లు, వాటిలో చేరుటకు కావలసిన అర్హతలు, సీట్లు నింపే విధానము, మార్గదర్శకాలు మొదలగు వివరాలు తెలుస్తాయి. కళాశాల వివరణ పత్రమును (Prospectus) పూర్తిగా చదివి విద్యార్థికి ఏ గ్రూపులో చేరడానికి అర్హత కలదో చెక్ చేసుకొని తను చేరదలచిన గ్రూపులను ప్రాధాన్యతా క్రమములో వ్రాసుకొనవలయును.
దరఖాస్తు చేయబోవు విద్యార్థులకు ముఖ్యముగా తెలియజేయు హెచ్చరిక ఏమనగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేస్తున్నప్పుడు విద్యార్థులు ఎంటర్ చేసిన వివరముల ఆధారంగా వారి అర్హత ప్రకారం కళాశాలలో సీటును మొదట తాత్కాలికంగా సిస్టమ్ అలాట్ చేస్తుంది.
ఇలా ఆలాట్ చేయబడిన సీటును కన్ఫర్మ్ చేసేముందు విద్యార్థి ధృవీకరణ పత్రములలోని వివరములను అధికారులు సిస్టమ్ లోనికి అప్లోడ్ చేస్తారు. ఇలా రెండు చోట్ల ఎంటర్ చేసిన వివరములలో ఏ ఒక్క వివరము టాలీ కాకపోయినా తాత్కాలికంగా కేటాయించబడిన సీటు రద్దు అవడం మరియు సదరు దరఖాస్తును సిస్టమ్ నుండి తొలగించడం ఆటోమేటిక్ గా జరిగిపోతుంది.
కావున విద్యార్థులు పైన చూపిన వెబ్ సైట్ నందుగల స్టూడెంట్ యూజర్ మాన్యువల్ ను, కళాశాలల ప్రాస్పెక్టస్ లను పూర్తిగా చదివి అర్థము చేసుకొని తమ దరఖాస్తులను సరియైన వివరములతో నింపి ఆన్ లైన్ లో సమర్పించవలసినదిగా తెలియజేయడమైనది.
విద్యార్థి తన అర్హత ప్రకారము తయారుచేసుకొన్న ఆప్షన్ల పట్టికను, స్టూడెంట్ మాన్యువల్ ను మరియు కళాశాలల ప్రాస్పెక్టస్ ల ప్రతులను ప్రక్కన వుంచుకొని దరఖాస్తును ఆన్ లైన్ లో నిoపడము శ్రేయస్కరము.
దరఖాస్తును నింపుతున్నపుడు ఏర్పడే సాంకేతిక సందేహములను నివృత్తి చేయుటకు, కళాశాలలలో వివిధ గ్రూపులు,ఎమ్ పి సి, బై పి సి,( బైపీసీ స్టూడెంట్స్ బయాలజీ, కెమిస్ట్రీ,ఫిజిక్స్ తో పాటు మ్యాథమేటిక్స్ కూడా ఎంచుకోవచ్చు అలాగే ఎమ్.పీ.సీ స్టూడెంట్స్ బయాలజీ కూడా తీసుకునే సౌకర్యం కలదు )
వసతి గృహములు, నియమ నిబంధనలు మొదలగు సందేహములను నివృత్తి చేయుటకు సహాయపడే అధ్యాపకుల ఫోను నంబర్లు admission.tirumala.org వెబ్ సైట్ ను ఓపెన్ చేసిన వెంటనే కనిపించే స్క్రీను పైన గల Helpline Numbers అనే బాక్స్ పైన క్లిక్ చేస్తే కనిపిస్తాయి. సంబంధించిన వారిని సంప్రదించి సందేహములను పూర్తిగా నివృత్తి చేసుకొని దరఖాస్తులను తప్పులు లేకుండా నింపి ఆన్ లైన్ లో సమర్పించవలసినదిగా తెలియజేయడమైనది
దరఖాస్తులను సమర్పించుటకు ఆఖరు తేదీ 03.06.2026.
