26.3 C
Hyderabad
September 19, 2026
జాతీయంహోమ్

సంచలన నిర్ణయం తీసుకున్న తమిళనాడు దళపతి

#TamilnadiCMVijay

తమిళనాడులోని ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి దళపతి విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలు, విద్యాసంస్థలు, బస్ స్టాండ్లకు 500 మీటర్ల పరిధిలో ఉన్న 717 మద్యం దుకాణాలను వచ్చే రెండు వారాల్లో మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

ప్రభుత్వ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న సున్నిత ప్రాంతాల సమీపంలోని ప్రభుత్వ మద్యం దుకాణాలను గుర్తించేందుకు ప్రత్యేక సర్వే నిర్వహించారు. ప్రస్తుతం Tamil Nadu State Marketing Corporation ఆధ్వర్యంలో రాష్ట్రంలో మొత్తం 4,765 మద్యం దుకాణాలు పనిచేస్తున్నాయి.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నిర్వహించిన సర్వేలో 500 మీటర్ల నిషేధిత పరిధిలో ఉన్న 717 షాపులను అధికారులు గుర్తించారు. వాటిలో:

ప్రార్థనా స్థలాల సమీపంలో – 276 షాపులు

విద్యాసంస్థల సమీపంలో – 186 షాపులు

బస్ స్టాండ్ల సమీపంలో – 255 షాపులు

ఇటీవల నివాస ప్రాంతాలు, ప్రజా ప్రదేశాల్లో ఉన్న మద్యం షాపులను మూసివేయాలని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు తీవ్రంగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో విజయ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా, టాస్మాక్‌పై గతంలో Enforcement Directorate దర్యాప్తు కూడా జరిగింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద నమోదైన కేసులకు సంబంధించి ఈడీ దాడులు నిర్వహించింది.

Related posts

ఖమ్మం ఉమ్మడి జిల్లాకు గోదావరి జలాలే లక్ష్యం

Satyam News

కూటమి ప్రభుత్వ సూపర్ సిక్స్… సూపర్ హిట్

Satyam News

19 మంది భారతీయుల అరెస్టు.. ఎందుకంటే…

Satyam News

శిథిలావస్థకు చేరుకున్న టిడ్కో ఇళ్లు

Satyam News

హ్యాషిష్ ఆయిల్ అక్రమ రవాణా గుట్టురట్టు

Satyam News

ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు: 3 వేల మంది టీచర్ల తొలగింపు!

Satyam News

Leave a Comment