ముఖ్యంశాలుహోమ్

ప్రొఫెసర్ తో వైసీపీ గేమ్స్…. బ్లూ మీడియాలో ఫేక్‌ స్టోరీ

#FakeNews

సెల్ఫ్‌ గోల్స్‌ వేసుకొని ఇరుక్కోవడం.. తర్వాత నాలుక కరచుకొని టాపిక్‌ డైవర్ట్‌ చేయడానికి ఫేక్‌ స్టోరీలు ప్రచారం చేయడం వైసీపీకి అలవాటుగా మారింది. వైఎస్‌ ఫ్యామిలీ రక్త చరిత్రపై జరుగుతున్న చర్చ నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రొఫెసర్‌తో గేమ్స్ మొదలు పెట్టారు.

ఒకవైపు అరెస్టు కావడానికి నేను సిద్ధం అంటూ ప్రొఫెసర్‌గారు సవాల్‌ చేస్తుంటే.. మరోవైపు ఆయన్ను అరెస్టు చేయడానికి వందలు, వేల సంఖ్యలో ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో దిగిపోయారనే ఫేక్‌ న్యూస్‌ని బ్లూ మీడియా వైరల్‌ చేస్తోంది.

ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ అరెస్టుకు తెలంగాణ పోలీసులు సహకరిస్తున్నారని కొందరు చెబుతుంటే.. తెలంగాణ పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే అరెస్టు చేస్తారని మరికొన్ని వార్తలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. పవన్‌ కళ్యాణ్‌, అమిత్‌ షాల గురించి ప్రొఫెసర్‌ చెప్పిన స్టోరీ ఎంత అబద్దమో.. ఆయన్ని అరెస్టు చేస్తున్నారంటూ.. ప్రచారంలో ఉన్న వార్తలు కూడా అంతే అబద్దం.

వైసీపీ గేమ్‌ని సొంత రాజకీయ లాభం కోసం వాడుకోవడానికి బీఆర్ఎస్, టీఆర్ఎస్‌ నాయకులు రంగంలోకి దిగారు. ప్రొఫెసర్‌ని అరెస్టు చేయడం తెలంగాణపై దాడి అని హరీశ్‌రావు కామెంట్ చేస్తే.. చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తామని కవిత ప్రకటించారు.

ఏమీలేని అంశం రాజకీయ రంగు పులుముకోవడంతో.. ఈ వివాదం తమకు చుట్టుకోకుండా.. తెలంగాణ పోలీసులు ముందుజాగ్రత్తగా ప్రొఫెసర్‌కి రక్షణ కల్పిస్తున్నారు. ఆయన ఇంటి దగ్గర సెక్యూరిటీతో పాటు స్టూడియోలకు వెళ్తున్నారని ప్రొఫెసర్‌ సతీమని స్వయంగా చెప్పారు.

కానీ ఎవరూ పట్టించుకోని.. ఎవరికీ అవసరం లేని నిజం ఏంటంటే.. ఏపీ పోలీసులు హైదరాబాద్‌ రాలేదు. ప్రొఫెసర్‌ని అరెస్టు చేయడం లేదు. ఇదంతా వైసీపీ డైరెక్షన్‌లో బ్లూ మీడియా నడిపిస్తున్న టాపిక్‌ డైవర్షన్‌ స్కీమ్‌. జగన్‌ మంచోడు అని చెప్పుకోబోయి.. రాక్షస రక్త చరిత్ర మొత్తం బయటపెట్టుకోవడంతో.. వైఎస్ ఫ్యామిలీ చేసిన నేరాలు, ఘోరాల నుంచి పబ్లిక్‌ ఫోకస్‌ని డైవర్ట్‌ చేయడానికే.. ప్రొఫెసర్‌ అరెస్టు పేరుతో జనాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ని అరెస్టు చేయబోతున్నారు అంటూ.. వార్తలు వైరల్‌ చేస్తున్న సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌, యూట్యూబ్‌ ఛానల్స్‌, వైబ్‌సైట్లు అన్నీ.. బ్లూ మీడియా పేటీఎం పెయిడ్‌ ఆర్టిస్టులే అని ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఈ ఛానల్స్ నుంచి వచ్చే ఏ వార్త అయినా.. నమ్మే ముందు ఒకటికి రెండుసార్లు ఫ్యాక్ట్‌ చెక్‌ చేసుకోవాలి. లేకపోతే తప్పుడు వార్తలతో నమ్మిన వాళ్లందరినీ బకరాల్ని చేసేస్తారు.

Related posts

ట్రంప్ కు బుద్ధి చెప్పేందుకు భారత్ రెడీ

Satyam News

4 జిల్లాలు.. 4 ఏళ్ల నరకానికి.. కూటమి ప్రభుత్వం ఊరట..!!

Satyam News

పవర్ ఫుల్ పవన్ కల్యాణ్ దృష్టి ఇక ఎర్రచందనం పైనే…

Satyam News

ఈ చిత్రంలో కూడా జాన్వీ అందాల ఆరబోతేనా?

Satyam News

హోర్ముజ్ జలసంధి లో ట్యాంకర్ల కు రక్షణ కల్పించలేదు

Satyam News

జగన్ టూర్ పై గంటా మాస్ వార్నింగ్

Satyam News

Leave a Comment