26.3 C
Hyderabad
September 19, 2026
ముఖ్యంశాలుహోమ్

తెలంగాణ ను వదలని పే టీ ఏం వైసీపీ బ్యాచ్

#Jagan

వైసీపీ పేటీఎం పెయిడ్‌ ఆర్టిస్టులు‌.. ఏపీ రాజకీయాలను భ్రష్టు పట్టించి.. గబ్బు లేపిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇదే పేటీఎం బ్యాచ్‌లో కొంత మంది తెలంగాణ రాజకీయాలకు ఈ మరకలు అంటించే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఏపీలో కూటమి పార్టీల మధ్య గొడవలు పెట్టడానికి.. ఒక అనలిస్టు చెప్పిన పులిహోర కథ.. కట్టుకథ అని తేలిపోవడంతో.. ఆయన యూటర్న్‌ తీసుకొని తన మాటలు ఉపసంహరించుకోవాల్సి వచ్చింది.

ఈ విషయాన్ని అక్కడితో వదిసి ఉంటే కథ సుఖాంతం అయ్యేది. కానీ ఇంకొంత మంది మేధావులను తోడు తెచ్చుకొని మరీ.. ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ను, ఏపీ సీఎం చంద్రబాబును, మంత్రి నారా లోకేశ్‌ను నోటికొచ్చినట్లు తిట్టించారు. ఈ బూతు పురాణానికి తెలంగాణ వాదాన్ని అడ్డం పెట్టుకోవడం మరో సమస్యగా మారింది. మీ పేటీఎం పంచాయితీకి.. తెలంగాణకు సంబంధం ఏంటని.. ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలకు ఈ మేధావుల దగ్గర సమాధానం లేదు.

ఎవరికో సపోర్ట్‌గా వెళ్లిన మేధావులు.. ఆంధ్రా పోలీసుల గొంతు మీద కాలేసి తొక్కుతాం.. ఆంధ్రా వాళ్లను తరిమి తరిమి కొడతామంటూ.. ఆవేశంతో ఊగిపోయారు. పక్క రాష్ట్రం ఫ్యాక్షన్‌ లీడర్‌ కోసం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య గొడవలు పెట్టేలా కొంత మంది నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే.. తెలంగాణకు చెందిన ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన నాయకుల్లో ఒక్కరు కూడా స్పందించకపోవడాన్ని ఆంధ్రా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.

తెలుగుదేశం, జనసేన పార్టీలు తెలంగాణలో యాక్టివ్‌ పాలిటిక్స్‌ చేస్తే.. అన్ని పార్టీలకు ఇబ్బందే. అందుకేనేమో.. పవన్‌ కళ్యాణ్‌ గురించి అడ్డగోలుగా మాట్లాడినా.. రెస్పాన్స్‌ లేదు. పక్క రాష్ట్రం నాయకత్వం గురించి నోరు జారి.. తెలంగాణ వాదం వెనుక దాక్కోవడం వల్ల.. పేటీఎం పైసల కోసం ఏమైనా చేసే పులిహోర బ్యాచ్‌కీ.. వాళ్ల యజమానులకీ ఉపయోగం ఉంటుందేమోగానీ తెలంగాణ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఆ విషయం తెలుసు కాబట్టే.. కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉన్నా.. ఇలాంటి వాళ్లను ఎంకరేజ్‌ చేయలేదు. ఇకపై పరిస్థితులు ఇలాగే ఉంటాయంటే.. ఆంధ్రా సెటిలర్లు తమ భవిష్యత్ ప్రణాళికలపై పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందని అనుకొంటున్నారు.

Related posts

స్పోర్ట్స్ పట్టుదలతో ఆడాలి

Satyam News

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంని విమర్శించే స్థాయి మీకు లేదు

Satyam News

మళ్ళీ విచారణ కు హాజరైన సునీల్ నాయక్

Satyam News

హమ్మయ్య… ఇప్పటికి దొరికాడు మంత్రి….

Satyam News

చార్మినార్ వద్ద భారీ భద్రత ఏర్పాటు

Satyam News

అలవోకగా జగన్ రెడ్డి అబద్ధాలు….

Satyam News

Leave a Comment