కడపహోమ్

ఘనంగా శ్రీకృష్ణదేవరాయల 555వ జయంతి

శ్రీకృష్ణదేవరాయల జయంతి సందర్భంగా కడప నగరం శ్రీకృష్ణదేవరాయ సర్కిల్ నందుగల విగ్రహానికి టిడిపి నగర ఉపాధ్యక్షులు అడ్వకేట్ గౌతమ్ కుమార్ పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం కేక్ కటింగ్ చేసి మీడియాతో మాట్లాడుతూ నందు శ్రీకృష్ణదేవరాయలు ఎన్నో చెరువులు కుంటలు తవ్వించి ప్రజలకు ఎన్నో సేవలు అందించారు. బంగారం రాయలవారి కాలంలో బంగారు ముత్యాలు ధాన్యాలు రాశులు పోసి అమ్మేవారు.

కవులను కళాకారులను పెంచి పోషించారు అన్నారు. విజయనగర మహాసామ్రాజ్య విస్తరణలో యుగ పురుషుడిగా ఆయనకు చారిత్రక నేపథ్యం ఉంది. సుపరిపాలన, రాజనీతిలో నిలిచిన రాజుల్లో ముందు వరుసలో ఉన్న ఆయన మహాసామ్రాజ్యాధీశుడుగా సకల కళా వల్లభుడిగా పేరు గాంచారు.

అయితే అంతుచిక్కని రహస్యంగా మారిన అతని నిష్క్రమణపై చారిత్ర ఆధారం లభించినట్టేనని తేల్చేశారు చరిత్రకారులు.

విజయనగర మహాసామ్రాజ్య విస్తరణలో శ్రీకృష్ణదేవరాయల దక్షతకు చరిత్రే సాక్ష్యం. ఆయనకళాభిమానానికి హంపి సహా దక్షిణ భారత్లో నేటికి సగర్వంగా నిలిచిన చారిత్రక కట్టడాలే నిదర్శనం.

ఆయన సాహితీ పిపాసకు.తెలుగుభాష అంటే మక్కువ ఎక్కువ. అయితే కృష్ణదేవరాయులు మరణంపై ఆది నుంచి అనుమానాలే. ఆయన మరణం పై ఆది నుంచి అనుమానాలే ఆయనకు గతించిన తేదీ పై ఎలాంటి క్లారిటీ లేదు కానీ తాజాగా కర్ణాటకలోని చారిత్రక శాసనంలో కృష్ణదేవరాయల మరణ తేదీపై సందిగ్ధం వీడిందన్నారు.

శ్రీకృష్ణదేవరాయలను ఆదర్శంగా తీసుకొని రాజకీయ నాయకులు కార్యకర్తలు ముందుకు పోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మన్సుర్ ఆలీఖాన్, రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ సుబ్బరాయుడు యాదవ్, పాలకొండ చైర్మన్ రెడ్డయ్య యాదవ్ శిలాసు, వలి, అమర్నాథరెడ్డి, సుబ్బారెడ్డి, మన్యం చలపతి నాయుడు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆపరేషన్ సిందూర్ కు ఏడాది పూర్తి

Satyam News

ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ: దారుణ హత్య

Satyam News

మంత్రి లోకేష్ సమర్థతకు దక్కిన గుర్తింపు

Satyam News

తెలంగాణలో నేడు విద్యాసంస్థల బంద్‌కు ఎన్‌ఎస్‌యూఐ పిలుపు

Satyam News

నవతరం పార్టీ అనంతపురం జిల్లా కొత్త కమిటీ

Satyam News

ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ

Satyam News

Leave a Comment