26.3 C
Hyderabad
September 19, 2026
ప్రపంచంహోమ్

Corona virus: వుహాన్ ల్యాబ్ కు అమెరికా నిధులు?

#TulasiGabbard

కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి కారణమైనట్లు ఆరోపణలు ఉన్న చైనాలోని వుహాన్ పరిశోధనా సంస్థకు నిధులు సమీకరించింది అమెరికా అనే కఠోర వాస్తవం మరో మారు చర్చకు వస్తున్నది. అమెరికా జాతీయ గూఢచారి విభాగం డైరెక్టర్ గా పదవీ బాధ్యతల నుంచి తప్పుకోబోతున్న తులసీ గబార్డ్ మరొక్కమారు ఈ ఆరోపణలను చేశారు.

చైనాలోని Wuhan Institute of Virologyలో ప్రమాదకరమైన “గెయిన్-ఆఫ్-ఫంక్షన్” పరిశోధనలకు అమెరికా పన్ను చెల్లింపుదారుల నిధులను అందించడంలో మాజీ వైద్య సలహాదారు ఆంథోనీ ఫౌచీ కీలక పాత్ర పోషించారని ఆమె ఆరోపించారు.

గబ్బార్డ్ విడుదల చేసిన పత్రాల ప్రకారం, ఫౌచీ నేతృత్వంలోని జాతీయ అలెర్జీ మరియు అంటువ్యాధుల సంస్థ ద్వారా వుహాన్ ప్రయోగశాలలో గబ్బిలాల కరోనా వైరస్‌లపై పరిశోధనలకు నిధులు అందించబడినట్లు పేర్కొన్నారు. కరోనా వైరస్ ప్రయోగశాల నుంచి అనుకోకుండా లీక్ అయి ఉండొచ్చనే సిద్ధాంతాన్ని అణచివేయడానికి గూఢచారి వర్గాల్లోని కొందరు అధికారులతో కలిసి పనిచేశారని కూడా ఆమె ఆరోపించారు.

కరోనా మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్న గబ్బార్డ్, అమెరికా ప్రజలకు నిజం తెలుసుకునే హక్కు ఉందన్నారు. మహమ్మారి మూలాలపై జరిగిన విచారణల్లో ప్రయోగశాల లీక్ సిద్ధాంతాన్ని సమర్థించిన విశ్లేషకులు ఒత్తిళ్లు, వృత్తిపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు విజిల్‌బ్లోయర్లు వెల్లడించారని తెలిపారు.

అయితే ఈ ఆరోపణలపై ఫౌచీ గతంలోనే పలు సందర్భాల్లో స్పందించారు. కరోనా మూలాలపై వచ్చిన కుట్ర సిద్ధాంతాల కారణంగా తనకు, తన కుటుంబానికి బెదిరింపులు ఎదురయ్యాయని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, అమెరికా మాజీ అధ్యక్షుడు జోబైడెన్ 2025 జనవరిలో ఫౌచీకి ముందస్తు క్షమాభిక్ష మంజూరు చేశారు. ఆ నిర్ణయం ఎలాంటి తప్పిదాన్ని అంగీకరించినట్లు కాదని, రాజకీయ ప్రేరేపిత దర్యాప్తుల నుంచి రక్షణ కల్పించడానికేనని బైడెన్ స్పష్టం చేశారు.

ఇక డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫౌచీకి కల్పించిన ప్రభుత్వ భద్రతను ఉపసంహరించుకున్నారు. ఇదే సమయంలో గబ్బార్డ్ విడుదల చేసిన తాజా పత్రాలు కరోనా మహమ్మారి మూలాలపై అమెరికాలో రాజకీయ, శాస్త్రీయ చర్చలను మరింత వేడెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే గబ్బార్డ్ చేసిన ఆరోపణలు ప్రస్తుతం ఆరోపణల స్థాయిలోనే ఉన్నాయని, వాటిపై స్వతంత్ర ధృవీకరణ, అధికారిక న్యాయపరమైన నిర్ధారణ ఇంకా వెలువడాల్సి ఉందని గమనించాలి.

Related posts

గ్రామీణాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది

Satyam News

జల విహార్ వద్ద అట్టహాసంగా కైట్ ఫెస్టివల్

Satyam News

మన అవయవాలు కాపాడుకోవడం ఎలా?

Satyam News

నేపాల్ వరదల్లో వందలాది మందిని కాపాడిన దేవత

Satyam News

టీటీడీలో జాబులు అమ్ముకున్న భూమన…???

Satyam News

నర్సింగ్ డైరెక్టరేట్ లో క్లినికల్ నర్సింగ్ కు ప్రాతినిధ్యం కల్పించాలి

Satyam News

Leave a Comment