25.2 C
Hyderabad
September 20, 2026
ప్రపంచంహోమ్

లెబనాన్ పై మళ్లీ దాడి చేసిన ఇజ్రాయెల్

#Lebenon

లెబనాన్ పై ఇజ్రాయెల్ ఏకపక్ష దాడులతో అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ విరమణ చర్చలు వాయిదా పడ్డాయి. ఒక వైపు శాంతి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్‌లోని హెజ్బొల్లా లక్ష్యాలపై శుక్రవారం భారీ వైమానిక దాడులు నిర్వహించింది.

ఈ దాడుల్లో కనీసం 16 మంది మరణించగా, పలువురు గాయపడినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. దక్షిణ లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై రాత్రి పొడవునా పలు దాడులు చేపట్టినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని హెజ్బొల్లా పదేపదే ఉల్లంఘిస్తోందని, అందుకే ప్రతిస్పందనగా ఈ చర్యలు తీసుకున్నామని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది.

అయితే, ఇరాన్-అమెరికా మధ్య కుదిరిన ఒప్పందం నేపథ్యంలో ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య శత్రుత్వ చర్యలు నిలిచిపోతాయని భావించినప్పటికీ, తాజా దాడులతో ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. లెబనాన్‌లోని పలు ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

ఇదిలా ఉండగా, అమెరికా-ఇరాన్ మధ్య జరగాల్సిన కీలక చర్చలు వాయిదా పడినట్లు స్విట్జర్లాండ్ విదేశాంగ శాఖ ధృవీకరించింది. ఈ విషయంపై స్పందించిన స్విస్ అధికారులు, చర్చలు ప్రస్తుతం వాయిదా పడినప్పటికీ భవిష్యత్తులో వాటి నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య తాజా ఘర్షణలు, అలాగే అమెరికా-ఇరాన్ చర్చల వాయిదా నేపథ్యంలో మధ్యప్రాచ్య ప్రాంతంలో శాంతి ప్రయత్నాలకు మరోసారి సవాళ్లు ఎదురవుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related posts

Box Office: కలెక్షన్లు తగ్గని దురంధర్ 2

Satyam News

జీసీసీ పెట్రోల్ బంక్ నిర్మాణ పనుల పరిశీలన

Satyam News

సింగపూర్ తో ఏపీ భాగస్వామ్యం బలోపేతంపై చర్చ

Satyam News

ధనవంతుడైన మామ హత్యకు కోడలు కుట్ర?

Satyam News

బోనాలు.. తెలంగాణ జీవనస్రవంతికి సాంస్కృతిక సాక్ష్యం

Satyam News

ద్విచక్రవాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి

Satyam News

Leave a Comment