25.2 C
Hyderabad
September 20, 2026
ముఖ్యంశాలుహోమ్

Karnataka Politics: ప్రియాంక్ ఖార్గేపై ఆర్ఎస్ఎస్ ఫిర్యాదు

#PrayankKharge

ఆర్ఎస్ఎస్ పై తప్పుడు ప్రచారం చేసినందుకు కర్ణాటక రాష్ట్ర హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే పై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) కేసు పెట్టింది. ఈ ఫిర్యాదును బెంగళూరు నగరంలోని XLII (42వ) అదనపు చీఫ్ జుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు విచారణ నిమిత్తం పరిగణనలోకి తీసుకుంది.

తేజస్ ఎ అనే వ్యక్తి దాఖలు చేసిన ఈ ఫిర్యాదులో కర్ణాటక రాష్ట్ర హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే, ఆ ఆ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ హారిస్ నలపాద్ అనే మరో వ్యక్తిని నిందితులుగా పేర్కొన్నారు.

ఫిర్యాదు పూర్వాపరాలను గమనిస్తే, కర్ణాటక రాష్ట్రంలోని పాఠశాలలు, పార్కుల వంటి ప్రభుత్వ ప్రాంగణాలలో ప్రైవేట్ సంస్థలు ఏ కార్యక్రమాలైనా నిర్వహించే ముందు అనుమతి తీసుకోవాలని ఆదేశిస్తూ ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసిన నేపథ్యంలో ఈ ఫిర్యాదు దాఖలైంది. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాలను అడ్డుకోవడమే ఈ సర్క్యులర్ లక్ష్యమని ఆరోపణలు ఉన్నాయి. ఈ సర్క్యులర్ జారీ అయిన సమయంలో పాఠశాలలు, మైదానాలతో సహా ప్రభుత్వ ప్రాంగణాలలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాలపై నిషేధం విధించాలని కోరుతూ ప్రియాంక్ ఖర్గే 2025 అక్టోబర్‌లో అప్పటి ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ఒక లేఖ రాశారు.

ఆ తర్వాత ప్రియాంక్, మహమ్మద్ హారిస్ నలపాద్ ఇరువురూ సోషల్ మీడియాలో ఆర్‌ఎస్‌ఎస్‌కు వ్యతిరేకంగా అవమానకరమైన వ్యాఖ్యలు పోస్ట్ చేశారని తన ప్రయివేట్ ఫిర్యాదులో తేజస్ పేర్కొన్నారు. భారతీయ న్యాయ సంహిత, 2023లోని సెక్షన్ 356 కింద నిందితులు ప్రియాంక్ ఖర్గే, నల్పాడ్‌పై తేజస్ చేసిన పరువునష్టం వ్యాఖ్యల ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్నారు.

ఈ కేసును క్రిమినల్ కేసుగా నమోదు చేయాలని, నిందితులకు సమన్లు ​​జారీ చేసి, వాటిని జులై 21, 2026 నాటికి తిరిగి సమర్పించేలా చూడాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు. ఆ ప్రకారం, నిందితులిద్దరూ జూలై 21, 2026న కోర్టుకు హాజరు కావాలని సమన్లు ​​జారీ అయ్యాయి.

Related posts

16వ సబ్ జూనియర్ హాకీ ఛాంపియన్ షిప్ ప్రారంభం

Satyam News

వైసీపీ కేతిరెడ్డి భూ ఆక్రమణ: ఇద్దరి సస్పెన్షన్

Satyam News

ఢిల్లీ బస్సులో మహిళపై అత్యాచారం

Satyam News

నీట్ ప్రశ్నాపత్రం లీక్ కేసులో 20 వేల పేజీల ఛార్జ్‌షీట్

Satyam News

నల్ల బ్యాడ్జీలతో విద్యుత్ ఉద్యోగుల నిరసన

Satyam News

సిఆర్డీఏ క‌మీష‌న‌ర్ క‌న్న‌బాబుపై బదిలీ వేటు

Satyam News

Leave a Comment