కృష్ణహోమ్

సిఆర్డీఏ క‌మీష‌న‌ర్ క‌న్న‌బాబుపై బదిలీ వేటు

#KannababuIAS

రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోన్న సిఆర్డీఏ క‌మీష‌న‌ర్ క‌న్న‌బాబును రాష్ట్ర ప్ర‌భుత్వం ఈరోజు బ‌దిలీ చేసింది. ఆయ‌న‌తో పాటు మ‌రి కొంద‌రు ఐఏఎస్ అధికారుల‌ను కూడా ప్ర‌భుత్వం బ‌దిలీ చేసింది. పాఠ‌శాల విద్యాశాఖ డైరెక్ట‌ర్‌గా ఉన్న విజ‌య‌రామ రాజును సిఆర్డీఏ క‌మీష‌న‌ర్‌గా నియ‌మించింది. మార్కెటింగ్ డైరెక్ట‌ర్‌గా ఉన్న ఎం. విజ‌య సునీత‌ను మార్కాపురం జిల్లా క‌లెక్ట‌ర్‌గానూ, ఆయుష్ డైరెక్ట‌ర్‌గా ఉన్న కొత్త‌మాసు దినేష్ కుమార్‌ను పోల‌వంర జిల్లా క‌లెక్ట‌ర్‌గా నియ‌మించారు.

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) కార్యదర్శిగా ఉన్న  రవి సుబాష్ (2013 బ్యాచ్) కు వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు (FAC) అప్పగించారు. మ‌రో ఐఏఎస్ అధికారి నీల‌కంఠారెడ్డిని జీఏడికి స‌రెండ‌ర్ చేశారు. గ‌త కొన్ని రోజులుగా ఐఏఎస్‌ల బ‌దిలీలు ఉంటాయ‌నే వార్త‌లను నిజం చేస్తూ ఈ రోజు కొంద‌రు ఐఏఎస్‌ల‌ను బ‌దిలీ చేశారు. అయితే…రాజ‌ధాని నిర్మాణంలో అత్యంత కీల‌క‌మైన సిఆర్డీఏ క‌మీష‌న‌ర్‌ను బ‌దిలీ చేస్తార‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు.

Related posts

గ్రోత్ రేట్ లో దూసుకుపోతున్న తెలంగాణ

Satyam News

ఆన్‌లైన్‌లో మహానాడు: చంద్రబాబు సంచలన నిర్ణయం

Satyam News

మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్

Satyam News

తెలంగాణలో నేడు విద్యాసంస్థల బంద్‌కు ఎన్‌ఎస్‌యూఐ పిలుపు

Satyam News

అమెరికాకు లోకేష్..పెరిగిన అంచనాలు.!

Satyam News

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పని చేస్తున్నాం

Satyam News

Leave a Comment