29.2 C
Hyderabad
September 20, 2026
పశ్చిమగోదావరిహోమ్

పోలవరం లో డీ వాటరింగ్ ప్రారంభం

#PolavaramProject

పోలవరం ప్రాజెక్ట్ లో డీ వాటరింగ్ ప్రారంభమైంది.  ప్రాజెక్ట్ లోని గ్యాప్ 1 ప్రాంతంలో సోమవారం జలవనరుల శాఖ,  ప్రాజెక్ట్ నిర్మాణ సంస్థ ఎం ఈ ఐ ఎల్ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించి డీ వాటరింగ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో  ప్రాజెక్ట్ ఎస్ ఈ రెడ్డి రామచంద్ర రావు, ఎం ఈ ఐ ఎల్ జి ఎం ఏ గంగాధర్, డీజీఎం మురళి పమ్మి తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్టులో డీ వాటరింగ్ కు  240 మోటార్లు ఏర్పాటు చేయనున్నారు.

వాటి ద్వారా ఏడొందల క్యూసెక్కుల నీటిని తోడేందుకు అవకాశం ఉంది. ఈ మోటార్లలో కొన్ని  88, మరికొన్ని 83.5 హార్స్ పవర్ సామర్ధ్యం కలిగి ఉన్నాయి. తొలి  రోజు 40 మోటార్లను ప్రారంభించారు. అవసరాన్ని బట్టి మిగిలిన మోటార్లను నడుపుతారు. వర్షాకాలం నేపథ్యంలో పనులకు ఆటంకం కలగకుండా ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో నిల్వ ఉన్న నీటిని ఎప్పడికప్పుడు తోడుతారు. రానున్న కాలంలో ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ ఎగువ, దిగువ ప్రాంతాల్లో కూడా ఈ సి ఆర్ ఎఫ్ పనులకు ఆటంకం కలగా కుండా డీ వాటరింగ్ చేస్తారు.

Related posts

ఇద్దరు అగ్ర మావోయిస్టుల లొంగుబాటు

Satyam News

ఆ ఒక్క నిర్ణయం క్రికెట్ గతిని మార్చింది…

Satyam News

ఇరాన్ పై పాశవిక దాడి: 25 మంది పౌరులు మృతి

Satyam News

ఇరాన్ దిశగా అమెరికా నౌకాదళ ‘ఆర్మాడా’

Satyam News

బద్దలవుతున్న జగన్‌ పీఏ అవినీతి కొండ….!!

Satyam News

డొల్ల కంపెనీల పుట్ట.. చెవిరెడ్డి బుట్ట

Satyam News

Leave a Comment