కృష్ణహోమ్

కొడాలి నానిపై ఫిర్యాదు: ఈ సారి అరెస్టు తప్పదా!

#KodaliNani

గుడివాడ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కొడాలి నానిపై శుక్రవారం పోలీసులకు అధికారికంగా ఫిర్యాదులు అందాయి. దేశ భద్రతకు సంబంధించిన అత్యంత ప్రతిష్టాత్మకమైన UAPA చట్టాన్ని ఉప్మా చట్టం అంటూ అవహేళన చేయడం, దేశద్రోహం కేసులో అరెస్ట్ అయిన జోసఫ్ రావణ్‌కు బహిరంగంగా మద్దతు పలకడంపై కూటమి శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

చట్టాలను, దేశ భద్రతను కించపరిచేలా మాట్లాడిన నానిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ నిన్న పోలీస్ స్టేషన్లలో లిఖితపూర్వక ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అయితే, ఈ తాజా ఫిర్యాదుల నేపథ్యంలో కొడాలి నానికి అసలైన చెక్ పెట్టే వ్యూహంపైనే ఇప్పుడు ప్రధానంగా చర్చ సాగుతోంది.

దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో అరెస్ట్ అయిన వ్యక్తిని వెనకేసుకురావడం, చట్టాన్ని హాస్యాస్పదంగా చిత్రీకరించడంపై నిన్న నమోదైన ఫిర్యాదులు కొడాలి నానిని రాజకీయంగా డిఫెన్స్‌లో పడేశాయి. ఈ తాజా వ్యవహారంపై తెలుగుదేశం, కూటమి నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

అయితే, ఇలాంటి నోటి దురుసు వ్యాఖ్యలపై వచ్చే ఫిర్యాదులు కేవలం సాధారణ కేసులకే పరిమితం అవుతాయని, లీగల్‌గా ఆయనను గట్టిగా ఇరకాటంలో పెట్టడం కష్టమనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నానిని చట్టపరంగా పూర్తిగా కట్టడి చేయాలంటే, నిన్నటి ఫిర్యాదులతో పాటు ఆయన గత ఐదేళ్ల అక్రమాలపై కూడా దృష్టి పెట్టాలనే డిమాండ్ వినిపిస్తోంది.

గత ప్రభుత్వ హయాంలో గుడివాడ కేంద్రంగా సాగిన ఇసుక మాఫియా, పేకాట క్లబ్‌ల నిర్వహణ, భూఆక్రమణలపై ఇప్పటికే కూటమి ప్రభుత్వం వద్ద సమగ్ర విచారణ నివేదికలు సిద్ధంగా ఉన్నాయి. నిన్నటి ఉపా చట్టం వ్యాఖ్యలపై వచ్చిన ఫిర్యాదులను విచారిస్తూనే.. ఈ పాత ఆర్థిక నేరాల ఫైళ్లను కూడా సమాంతరంగా ముందుకు కదిలించడమే ప్రభుత్వానికి సరైన వ్యూహం కాగలదు. కేవలం మాటలను పట్టుకుని కాలయాపన చేయడం కంటే, ఆధారాలతో కూడిన పాత అవినీతి కేసులను బయటకు తీస్తేనే న్యాయపరంగా బలమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

గుండె ఆపరేషన్ సాకుతో, అనారోగ్య కారణాల వల్ల కొడాలి నానిపై గతంలో కఠిన చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం కాస్త వెనకడుగు వేసింది. కానీ ఇప్పుడు ఆయన పూర్తిగా కోలుకుని, దేశ భద్రతా చట్టాలనే అవహేళన చేసే స్థాయికి వచ్చారు. నిన్న అందిన ఫిర్యాదుల ఆధారంగా చట్టం తన పని తాను చేసుకుంటూ పోవాలని, రాజకీయ కక్షసాధింపు అనే ముద్ర పడకుండా పక్కా ఆధారాలతో ఆయన అక్రమాలపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కూటమి శ్రేణులు కోరుతున్నాయి.

Related posts

నిధులు ఆంధ్రాకు నీతులు తెలంగాణకు

Satyam News

క్రికెట్‌ స్టార్ స్మృతి మంధాన వివాహానికి మరో అడ్డంకి

Satyam News

‘‘అక్రమ’’ జర్నలిస్టు అరెస్టు

Satyam News

తెలంగాణలో ప్రైవేటు సమీకృత ఆయిల్ పామ్ కాంప్లెక్స్

Satyam News

సింగరేణి కరెంటు జైపూర్ కు: హరీష్ తీవ్ర అభ్యంతరం

Satyam News

పోలవరం ప్రాజెక్టు సందర్శించిన రాష్ట్ర గవర్నర్

Satyam News

Leave a Comment