26.3 C
Hyderabad
September 19, 2026
మహబూబ్ నగర్హోమ్

శ్రీరంగాపూర్ ఎస్సై బాధ్యత చేపట్టిన హిమబిందు

#HimabinduSI

వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ ఎస్సైగా  కె. హిమబిందు పదవి బాధ్యతలు  స్వీకరించారు. శ్రీరంగాపూర్ నూతన ఎస్సై  పదవి బాధ్యతలు స్వీకరించిన హిమబిందు శుక్రవారం వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించ రాదని శాంతి భద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హిమబిందు  వనపర్తి జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్  2వ  ఎస్సైగా విధులు నిర్వహిస్తూ  శ్రీరంగాపూర్ కు బదిలీపై వచ్చారు. శ్రీరంగాపూర్ ఎస్సై రామకృష్ణ జోగులాంబ గద్వాల జిల్లాకు బదిలీపై వెళ్లారు. శాంతిభద్రతల పరిరక్షణకు  శ్రీరంగాపూర్ మండల  ప్రజలు సహకరించాలని నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరిస్తూ ఆమె ప్రజలను కోరారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

ఏపీ లో ఇలా జరుగుతున్నది ఏమిటి?

Satyam News

సింగరేణి కార్మికులకు మరో శుభవార్త

Satyam News

SIRతో దొంగ ఓట్ల గుట్టు రట్టు..వైసీపీలో మొదలైన వణుకు.!

Satyam News

జోర్డాన్‌లో చిక్కుకున్న తెలంగాణ కార్మికులు

Satyam News

ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో భారీ అవినీతి

Satyam News

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ….??

Satyam News

Leave a Comment